టెలివిజన్ రంగంలో హాట్ యాంకరింగ్ చేస్తూ జబర్దస్త్ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించింది అనసూయ. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ కామెడీ షో ద్వారా అనసూయ తన హాట్ హాట్ అందాలతో అదిరిపోయే డ్రెస్సింగ్ తో కుర్రకారు నూ ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి అనసూయ యాంకరింగ్ లో చాలా ఆఫర్లు అందుకుంటూ క్షణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అదిరిపోయే హిట్ అందుకుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనసూయ అద్భుతమైన స్క్రీన్ పర్ఫామెన్స్ చేసి మంచి విజయాన్ని సాధించింది. అటువంటి సమయంలో సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులను తనలో ఉన్న నటన తో ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవటానికి గల కారణాలలో అనసూయ పాత్ర కూడా ఒకటి అనేలా నటించింది.

 

'రంగస్థలం' లాంటి సినిమాలతో అందరిని మెప్పించిన అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో కీలక క్యారెక్టర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒకపక్క సినిమా రంగంలో మరోపక్క యాంకరింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న అనసూయ తాజాగా కొత్త రంగంలోకి అడుగు పెట్టింది. అదేమిటంటే చీరాల బ్రాండ్ ప్రమోషన్ రంగం. షాప్  ఓపెనింగ్స్ తో పాటుగా చీరల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ గ్లామరస్ ఫోటోషూట్ల తో ఎంతగానో అదరగొడుతోంది.

 

ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తో….తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను మురిపిస్తుంది. చేతినిండా సినిమా ఆఫర్లతో ఇండస్ట్రీలో రాణిస్తున్న అనసూయ తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్ పోషిస్తోంది. అదే తరుణంలో విజయ్ దేవరకొండ సినిమాలో కూడా అనసూయ నటిస్తోంది. ఏది ఏమైనా ఒకపక్క బుల్లితెరపై మరోపక్క వెండితెరపై రాణిస్తున్న అనసూయ తాజాగా షాప్ ఓపెనింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా రాణించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: