టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఒక వైపు రాజకీయాలతో పాటు మరొకవైపు సినిమాలు కూడా కొనసాగిస్తున్న ముందుకు నడుస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చివరిగా రెండేళ్ల క్రితం ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది. అయితే అప్పటికే తన రాజకీయ పార్టీపై దృష్టి పెట్టిన పవన్, అప్పటి నుండి ఇప్పటివరకు మరొక సినిమాలో నటించలేదు. అయితే ఎట్టకేలకు ఫ్యాన్స్ యొక్క కోరిక మేరకు ఇటీవల తన తదుపరి సినిమా షూటింగ్ మొదలెట్టిన పవన్, అతి త్వరలో మరొక రెండు సినిమాల్లో కూడా నటించనున్నారు. అయితే కెరీర్ పరంగా పవన్ కు తొలిప్రేమ సినిమా ఎంతో క్రేజ్ తీసుకురాగా, దాని అనంతరం వచ్చిన బద్రి, ఖుషి సినిమాలు పవన్ ని హీరోగా అత్యున్నత శిఖరాలకు చేర్చాయి. 

 

అయితే వాటి తరువాత ఆయన నటించిన జానీ సినిమా కొంత గ్యాప్ తరువాత రిలీజ్ అయి ఫ్లాప్ గా నిలిచింది. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ తొలిసారిగా దర్శకత్వం కూడా వహించారు. అయితే కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, ఆ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించడం విశేషం. రేణు దేశాయి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తనకు ఇష్టమైన రమణ గోగులను సంగీత దర్శకుడిగా తీసుకున్న పవన్, ఈ సినిమా కోసం పగలు రాత్రి ఎంతో కష్టపడ్డారు. అంతేకాక జానీ క్యారెక్టర్ కోసం ఎంతో సన్నగా తయారయిన పవన్, ఆఖరికి రిలీజ్ తరువాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం కావడంతో పవన్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశకు గురయ్యారు. 

 

నిజానికి ఖుషి తరువాత చాలా గ్యాప్ తీసుకుని పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో జానీ పై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. అయితే సినిమా కథ విషయమై తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో పవన్ కొంత విఫలం అయ్యారు. నిజానికి ఖుషితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్, ఒకవేళ జానీ తో ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నా, అప్పట్లో ఆయనకు కెరీర్ పరంగా మరింత క్రేజ్ పెరిగి అందనంత స్థాయికి ఎదిగేది. ఇక ఆపై వచ్చిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు కూడా వరుసగా నిరాశపరిచి ఆయన కెరీర్ కు మరింత ఇబ్బందులు కలిగించాయి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: