నటరత్న ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్, బాలనటుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బలరామాయణం అనే సినిమాలో రాముడిగా నటించి ఆ వయసులోనే ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని హీరోగా మారి నిన్ను చూడాలని అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తారక రాముడు, అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయారు. నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన మూడవ తరం నటుడిగా ఎన్టీఆర్, ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. మధ్యలో కెరీర్ పరంగా కొన్ని ఫ్లాప్స్ కూడా చవి చూసిన ఎన్టీఆర్, ఇటీవల మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 

 

ఇక ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆరఆర్ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా స్క్రీన్ పై కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ తో ఎంతో మంచి అనుబంధం దర్శకుడు రాజమౌళికి ఉంది. రాఖీ సినిమా తరువాత ఎంతో బొద్దుగా ఉన్న జూనియర్ ని వెయిట్ తగ్గించమని చెప్పి, చివరికి పూర్తిగా చాలావరకు బరువు తగ్గించి యమదొంగ సినిమా తీశారు రాజమౌళి. ఎందరు హీరోలున్నా తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ అంటే ప్రాణం అని చెప్పే రాజమౌళి, ఎన్టీఆర్ విషయమై అప్పుడప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తుంటారు. తారక్ కు స్వతహాగా ఎటువంటి చెడు అలవాట్లు లేవని, కాకపోతే అతడికి ఉన్న భయంకరమైన వీక్ నెస్ ఫుడ్ అని చెప్పడం జరిగింది. 

 

చిన్నప్పటి నుండి మంచి ఫుడ్ దొరికితే ఎంతో ఇష్టంగా లాగించేసే అలవాటున్న తారక్, పెరిగి పెద్దయి హీరోగా మారాక కూడా ఆ అలవాటుని మనుకోలేకపోతున్నారని, యమదొంగ సమయంలో ఎలాగో కష్టపడి వెయిట్ తగ్గినా, ఆ తరువాత మధ్యలో మాత్రం మంచి పుష్టికరమైన ఆహారం తీసుకుని మళ్ళి బాగా వెయిట్ గెయిన్ చేసారని, ఒక్కోసారి ఛ, నీకు చెప్పడం మా వల్ల కాదు అనుకుంటూ ఉండేవాళ్ళం అని, రాజమౌళి సరదాగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కోసం కోసం ఎన్టీఆర్ కొంత వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: