బుల్లితెర యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ ఎదిగిన యాంకర్ ప్రదీప్.. జీ తెలుగులో గడసరి అత్తా సొగసరి కోడలు అనే షో తో బుల్లితెరకు పరిచయమై.. అక్కడ అల్లరి చిల్లర మాటలు మాట్లడుతూ.. అతి అంటే ఇదేరా అనేలా అల్లరి చేసి ఎదిగిన యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది యాంకర్ ప్రదీప్ ఏ.. 

 

అలాంటి యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెరను ఏలేస్తున్నాడు.. స్టార్ యాంకర్ అయిపోయాడు.. జీ తెలుగు.. స్టార్ మా, ఈటీవీ అని తేడా లేకుండా అన్ని టీవీలలో కనిపిస్తూ... ప్రజలను అలరిస్తూ షోని సూపర్ హిట్ చేస్తున్నాడు ప్రదీప్. అలాంటి ఈ ప్రదీప్ అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న క్యరెక్టర్లతో ఆలా ఆలా మెరిసేవాడు. 

 

అలాంటి ప్రదీప్ ప్రస్తుతం హీరోగా మొదటి సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా పేరు ''30 రోజుల్లో ప్రేమించడం ఎలా''. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్... ఫస్ట్ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ సాంగ్ ''నీలి నీలి ఆకాశం'' సూపర్ హిట్ అయ్యింది. ఇంకా ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

Image result for amritha aiyer with pradeep

 

యాంకర్ గా అద్భుతమైన స్థానాన్ని అందుకున్న ప్రదీప్.. ప్రస్తుతం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అలాంటి ఈ సమయంలో ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ ని చూశారా ? అంటూ నెట్టింట్లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. అయితే ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నిజంగా ఆమెను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.. అంత అందంగా ఉంది ఆమె.. ఆమె ఎవరో కాదు.. ప్రస్తుతం ప్రదీప్ తో పాటు నటించే హీరోయిన్ అమ్రిత్. ఆమె ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ అంటూ నెట్టింట్లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కొందరు స్పందిస్తూ.. అవును అవును.. ఆమె అతను కలిసి నటించే సినిమాలో ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ అంటూ సమాధానం ఇస్తున్నారు. మరి ఆమె ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ ఆ కదా? అనేది తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: