మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్ కోట్లలో ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ దగ్గర్నుంచి ఇప్పుడు ఆ ఫ్యామిలీ  నుంచి వచ్చిన కొత్త హీరో దాకా ఎవరి సినిమా రిలీజైన ఫ్యాన్స్ హాడవుడి ఓ రేంజ్ లో ఉంటుంది. అసలు ఫ్యాన్స్ లేకపోతే మేము లేము అని మెగాస్టార్ ప్రతీసారి సభా ముఖంగా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక ఆడియో ఫంక్షన్, ఏదైనా మెగా ఈవెంట్, లేదా మరేదైనా పబ్లిక్ ఈవెంట్, లేదా ఏదైనా ఆలయాలను దర్శించినప్పుడు, ఇక ముఖ్యంగా తమ సినిమాలు రిలీజైనప్పుడు మన మెగా అభిమానులను కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం.

 

తోపులాటలు తొక్కిసలాటలు బాగా జరుగుతాయి. ఇక ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడి వచ్చినా తన భార్య స్నేహలతా రెడ్డిని వెంట బెట్టుకొనే వస్తాడు. అది ఆయన పెళ్ళి జరిగినప్పటి నుంచి చూస్తున్నాము. ఈ జంట ని చూడాటానికి చాలా ముచ్చటగాను ఉంటారు. అంతే కాదు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకి అల్లు అరున్ స్నేహ లని చూస్తే సంతోషమేస్తుంది. ఇక బన్నీ తన బెటరాఫ్ ని తీసుకొని ఎక్కడికి వచ్చినా జనాలు వాళ్ళని చూడటానికి ఎగబడతారు. బన్నీ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీ పడుతుంటారు. ఆ టైం లో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలంటే బౌన్సర్స్ కి ప్రాణం పోతుంది. దాంతో బౌన్సర్స్ బన్నీ ఫ్యాన్స్ పట్ల చాలా హార్ష్ గాను బిహేవ్ చేస్తారు. ఇలాంటి ఒకసందర్భంలో బన్నీ ఏంటో తన క్యారెక్టర్ ఏంటో చూపించుకున్నాడు.

 

బన్నీ ని స్నేహని చూడటాని వచ్చిన ప్రేక్షకుల్లో కొంతమంది మరీ తోపులాట ఎక్కువై ఒకరిమీద ఒకరు పడుతున్నారు. అదే సమయంలో తన అభిమాన హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆరాటపడి కొంతమంది బన్నీ కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అయితే బన్నీ షేక్ హ్యాండ్ ఇచ్చే ఒక కుర్రాడి గుండెల మీద బౌన్సర్ గట్టిగా చేతులేసి తోసేశాడు. అది కళ్ళారా చూసిన బన్నీ కి పిచ్చ కోపం వచ్చింది. అందరిలో అరిచిపారేశాడు. ఏంటి చేయాస్తున్నావేంటి ..ఆ కురాడి మీద చెయ్యోస్తున్నావేంటి అంటూ బౌన్సర్ కి వార్నింగ్ ఇచ్చాడు. అలా తోసేసిన కుర్రాడిని దగ్గరికి పిలిచి తనతో సెల్ఫీ దిగాడు ఇదీ బన్నీ గాని మెగా ఫ్యామిలీ గాని తమ అభిమానులపట్ల ఉండే ఇష్టం. తన ఫ్యాన్స్ పట్ల బన్నీ క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. ఎంతైనా స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: