‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం చరణ్ జూనియర్ లు రాజమౌళి బందీలుగా కొనసాగుతూనే అవకాశం చిక్కినప్పుడల్లా వచ్చే సంవత్సరం వారు చేయబోయే మిగతా సినిమాల గురించి ఆలోచనలు చేస్తూ అనేకమంది దర్శకులు చెపుతున్న కథలను వింటున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో జూనియర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి.


ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలలో త్రివిక్రమ్ తన తదుపరి మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుంది అని లీకులు ఇచ్చాడు. దీనికి సంబంధించి ఒక కథను కూడ జూనియర్ కోసం ఆలోచిస్తున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పాడు. 


వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది అని అందరు భావించారు ఇప్పుడు ఈ ప్లాన్స్ లో మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం తమిళ దర్శకుడు వెట్రి మారన్ అని అంటున్నారు. ‘అసురన్’ మూవీతో ఒకేసారి సంచలన దర్శకుడుగా మారిపోయిన ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ జూనియర్ కు విపరీతంగా నచ్చడంతో ఆ కథను తన గురించి లాక్ చేయమని తారక్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 


ఈ  చిత్రన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్  బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని  డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అసురన్’ దర్శకుడు చెప్పిన కథ పై కళ్యాణ్ రామ్ సైతం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది. దీనితో వెట్రీ మారన్ కు తమిళ్ లో వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో వీలైనంత త్వరగా జూనియర్ తో సినిమాకు సంబంధించిన అధికార ప్రకటనను ఇమ్మని ఈ డైరెక్టర్ కళ్యాణ్ రామ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అతిత్వరలో అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు. దీనితో తారక్ త్రివిక్రమ్ ని తాత్కలికంగా హోల్డ్ లో పెట్టెడా లేకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత ఈ రెండు సినిమాలను ఒకేసారి లైన్ లో పెట్టి తన అభిమానులకు జోష్ ను ఇస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: