నందమూరి బాలకృష్ణ సినీ వారసుడిగా ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ అడుగు పెట్టే అవకాశం ఉందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. కాని అతను సినిమాల్లోకి వస్తాడా అసలు ఆసక్తి ఉందా లేదా అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటి వరకు ఏ సమాధానం కూడా దొరకలేదు అనేది వాస్తవం. రాజకీయంగా బాలకృష్ణ బిజీ అయ్యే అవకాశం ఉంది, ఆయన కుమారుడు ఇక సినిమాలు చేస్తారు అనే ప్రచారం చాలా వరకు చేసారు. కాని అవి ఎంత వరకు నిజమో మాత్రం తెలియదు. 

 

ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు బాలకృష్ణ, తన కొడుకుని తొందర పెడుతున్నారా...? మొక్షు కి ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని బాలయ్య తెలుసుకోవడం లేదా...? అంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు. సినిమా మీద అంత ఇష్టం ఉంటే అతను ఇంకోలా ఉండే వాడు. ఈ మధ్య బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు చూస్తే అసలు ఆయన కుమారుడుకి సినిమాల మీద ఆసక్తి లేదు అనే విషయ౦ స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ కు ఒక కొత్త సమస్య వచ్చింది అంటున్నారు పలువురు. 

 

మోక్షజ్ఞ తనకు సినిమాలు అంటే ఆసక్తి లేదు, వ్యాపారం చేస్తాను లేదా ఉద్యోగం చేస్తాను అని చెప్తున్నాడట. దీనితో బాలకృష్ణ ఇప్పుడు చిరాకు పడుతున్నారట. ఇన్నాళ్ళు దర్శకులు, కథలు అంటూ తాను ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు వ్యాపారం ఏంటీ అని ప్రశ్నించాగా, లేదు తనకు ఇప్పట్లో ఆసక్తి లేదు అంటున్నాడని టాక్. దీనితో బాలకృష్ణ మోక్షజ్ఞ విషయంలో వెనక్కు తగ్గారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా తన కొడుకుని సినిమాలకు పరిచయం చెయ్యడం మాత్రం ఇప్పుడు బాలయ్యకు పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: