ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాల హ‌వా కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగు చిత్ర సీమ లో రీమేక్ చిత్రాలు ఇప్పటికే చాలా మంది చేసారు.. చేస్తున్నారు కూడా. ఇలా రీమేక్‌ల పేరిట ఆ చిత్ర హక్కులను చేజిక్కించుకుని తమ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఆ రీమేక్‌ల చిట్టా తీస్తే.. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్, ఇండస్ట్రి హిట్స్ కొట్టిన చిత్రాలు ఉన్నాయి.. బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తాప‌డిన చిత్రాలు ఉన్నాయి. ఇవ ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటు హీరోగా అటు నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇప్పటికే తన నిర్మాణ బ్యానర్ అయిన కొణిదల ప్రొడక్షన్స్ లో చిరంజీవి నటించిన ఖైదీ నెం 150, సైరా సినిమాల‌ను తెరకెక్కించాడు. ప్ర‌స్తుతం కొరటాల శివ‌ మెగాస్టార్ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. 

 

అయితే కొణెదల ప్రొడక్షన్స్ పై ఇప్పటికే ఓ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఇక తాజాగా ఈ హీరో మరో సినిమా రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేశాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నాడు. ఈ మేరకు ఒప్పందం కూడా పూర్తయింది. తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేయకూడదనే కండిషన్ కూడా ఇందులో ఉంది. ఈ మధ్య మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆ మూవీ గురించే టాక్ వినపడుతోంది. వైవిధ్యభరితమైన చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు, హీరో అయిన పృథ్వీరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ అక్క‌డ సూప‌ర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా స్టోరీ చాలా కొత్త‌గా ఉంటుంది. 

 

ఒక స్టార్ హీరో ఉంటాడు. అతడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ అభిమానుల్లో డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే అధికారి కూడా ఉంటాడు. ఓసారి హీరోకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ పని పడుతుంది. అదే టైమ్ లో అధికారి సీన్ లోకి వస్తాడు. అభిమాన హీరో వస్తున్నాడని అనుకుంటాడు. కానీ ఇంకేదో జరుగుతుంది. ఆ త‌ర్వాత ఇద్దరి మధ్య ఇగో పెరుగుతుంది. ఇలా వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ తో క‌థ ఉంటుంది. మ‌రి రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్న‌ ఈ సినిమాలో హీరోగా చేర్రీయే చేస్తాడా..? ఆ అభిమాని పాత్ర‌లో ఎవ‌రు చేస్తారు..? అన్న‌ది క్లారిటీ లేదు. ఇక ఏమైందో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య‌ కాలంలో చ‌ర‌ణ్‌ రీమేక్ సినిమాల‌పై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాగా, చ‌ర‌ణ్ ఇప్ప‌టికే  లూసిఫర్ రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

 


 
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: