సినిమా కథల ఎంపిక విషయంలో దిల్ రాజ్ చాల తెలివిగా నిర్ణయం తీసుకుంటాడు అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. గత వారం విడుదలైన ‘జాను’ మూవీ మాతృక ’96’ దిల్ రాజ్ మోజుపడి కొనుక్కుని తెలుగులో రీమేక్ చేయడంతో ఈ మూవీలో దిల్ రాజ్ ఏమి మ్యాజిక్ చేయగలడు అంటూ చాల మంది ఆశ్చర్య పోయారు. 


అయితే ‘జాను’ విడుదల వరకు దిల్ రాజ్ ప్రదర్శించిన మితిమీరిన విశ్వాసాన్ని పరిశీలించిన వారు మాత్రం ఎదో ఒక ధైర్యం ఈ మూవీ విషయంలో దిల్ రాజ్ కు ఉంది అంటూ అంచనాలకు వచ్చారు. ఇప్పుడు టోటల్ గా ‘జాను’ ఫలితం తేలిపోవడంతో ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లకు ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్లు నష్టాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. 


దీనితో దిల్ రాజ్ బయ్యర్లతో తన సంబంధాలు చెడిపోకుండా వారికి ‘జాను’ నష్టాల నిమిత్తం కోట్ల రూపాయలలో నష్ట పరిహారం చెల్లించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘జాను’ ఫలితం దిల్ రాజ్ ను ‘పింక్’ రీమేక్ విషయంలో చాల ఖంగారు పడుతున్నట్లు సమాచారం. 


ఈ మూవీకి సంబంధించి బడ్జెట్ 80 కోట్లకు పైగా దాటిపోతు ఉండటంతో దిల్ రాజ్మూవీ పై ఖచ్చితంగా 100 స్థాయిలో బిజినెస్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే దిల్ రాజ్ దగ్గర రెగ్యులర్ గా సినిమాలను కొనుక్కునే బయ్యర్లు కూడ ఈ మూవీకి సంబంధించి దిల్ రాజ్ చెపుతున్న రేట్లకు వెనకడుగు వేస్తున్నట్లు టాక్. దీనితో ఈ మూవీని తక్కువ రేట్లకు అమ్మలేక దిల్ రాజ్ కొన్ని ఏరియాలలో అతడే స్వయంగా రిలీజ్ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో పవన్ ‘పింక్’ కు ఊహించని నష్టాలు వస్తే ‘జాను’ నష్టాలతో కలుపుకుని దిల్ రాజ్ భారీగా నష్టపోయే అవకాసం ఉంది అంటూ దిల్ రాజ్ జడ్జిమెంట్ పట్టు తప్పిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: