తమిళంలో హీరో అజిత్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అజిత్ ఎలాంటి మేకప్ వేసుకోకుండా... హెయిర్ కి ఎలాంటి కలర్ వేసుకోకుండా... నాచురల్ గా నటించడాన్ని అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అజిత్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. గత కొంతకాలంగా అజిత్ చేసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలుస్తుంది. దీంతో ఎక్కువ మంది దర్శక నిర్మాతలు హీరో అజిత్ తో  సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అటు  అజిత్ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే మామూలుగా అయితే సీనియర్ హీరోలు తమ తెల్ల జుట్టు కి కలర్ వేసుకొని యువకుడు గా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

 

 

 కానీ తమిళ హీరో అజిత్ మాత్రం వైట్ హెయిర్ తోనే కొత్త ట్రెండ్ సృష్టించాడు. దీంతో అజిత్ లుక్ ఎంతో మంది అభిమానులను ఆకర్షించింది. అయితే గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న అజిత్ ప్రస్తుతం వాలి మై సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ టాప్ నిర్మాత అయినా బోని కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంతమేర చిత్రీకరణ కూడా పూర్తయింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది  ఈ సినిమా. కాగా త్వరలో విలన్ కాంబినేషన్లో ఈ సినిమా  చిత్రీకరణ చేయవలసి ఉందట. 

 

 

 

 ఈ నేపథ్యంలో విలన్ పాత్రలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే దానిపై ప్రస్తుతం ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తెలుగు నుంచి యంగ్ హీరోల ను తీసుకోవాలనే ఉద్దేశంతో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు తెలుగులో కార్తికేయ పేరు వినిపించింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనదైన నటనతో అద్భుతం గా అందరిని ఆకట్టుకున్న యువ హీరో కార్తికేయని  అజిత్ సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో తెలుగు హీరో కూడా చేరిపోయాడు. తాజాగా నవదీప్ పేరు కూడా తెరమీదికి వచ్చింది. ఇద్దరికీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన అనుభవం ఉండడంతో... హీరో అజిత్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని.. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయనుందట  చిత్ర బృందం. సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. సినిమాలు అజిత్ సరసన హుమా ఖురేషి  కనిపించనుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: