సంగీత దర్శకుడు సమకూర్చిన సంగీతం ఎంతో మధురం... ఆ సంగీత దర్శకుడు అందించిన పాటలు ఎన్నేళ్లయినా  ఎవర్గ్రీన్ గా  మిగిలిపోయాయి. ఆ పాటలు విన్నంత సేపు  మనసు మొత్తం తేలిక పడిపోతుంది... పాటలు ఎన్ని సార్లైనా వినాలి అనిపిస్తుంది... ఎంతో మంది సంగీత దర్శకులకు ఆయన ఒక ఇన్స్పిరేషన్.. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా  క్లాసిక్ పాటలకు కేరాఫ్ అడ్రస్... మెలోడీ మాంత్రికుడు... సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఏకంగా ఆస్కార్ లాంటి అత్యున్నత పురస్కారాన్ని కూడా దక్కించుకున్న ఏ ఆర్ రెహమాన్. ఏ.ఆర్.రెహమాన్ పాటలు కి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక అందరి మనసులను పులకరింప జేసే ఎన్నో పాటలను ఏ.ఆర్.రెహమాన్ అందించారు. ఏకంగా తన మధుర స్వరాల కు గాను ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకున్నారు. 

 

 

 

 అయితే ఎంతో పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ ఎక్కడ మీడియా ముందు కనిపించరు ఏ ఆర్ రెహమాన్. కానీ తాజాగా ఏ.ఆర్.రెహమాన్ మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం తాను ఎంతో అందంగా కంపోజ్ చేసిన పాటలు అన్నింటిని రీమిక్స్ చేసి నాశనం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ ఆర్ రెహమాన్. నేను కంపోజ్ చేసిన చాలా పాటలను రీమిక్స్ గా మార్చారు. ఒరిజినల్ పాటలను నాశనం చేస్తున్నారు... ఇప్పటివరకు నేను పాడిన పాటలు ఎన్నో  రీమిక్స్ చేయగా... నాకు నచ్చిన ఓకే పాట హమ్మ హమ్మ... మిగతావన్నీ రోత పుట్టించేలా ఉన్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రహమాన్. ఎన్ని రీమిక్స్లు వచ్చినప్పటికీ నా ఒరిజినల్ పాటలను వినడానికి ఇష్టపడే అభిమానులు ఇంకా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

 

 నేను ఇతర పనులతో బిజీగా ఉన్నాను అందుకే హిందీ సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరంగా ఉన్నాను అంటూ తెలిపారు సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్. తాను ఓ స్టూడియో నిర్మిస్తున్నట్లు తెలిపిన ఏ ఆర్ రెహమాన్.. ఆ స్టూడియోలోనే తన పిల్లలకు సంగీతం కూడా నేర్పిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఏ.ఆర్.రెహమాన్ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న సినిమాలో సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా  చాలా రోజుల తర్వాత ఏ.ఆర్.రెహమాన్ పాటలు వస్తుండడం తో  అటు  అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: