టాలీవుడ్ లో ఓ డైరెక్టర్ ఓవరాక్షన్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏదో కాలం కలిసొచ్చి నక్కతోక తొక్కిన టు గా రవితేజ, పవన్ కళ్యాణ్ తో ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు హిట్ అవడంతో ఇక తనను మించిన వాడు లేడని ఆ డైరెక్టర్ అప్పట్లో తెగ విర్రవీగి పోయాడు. రెండు హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్న ఆ డైరెక్టర్ ఆ తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేసి ఘోరమైన ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ ను ఏ హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు. దాదాపు 200 ఏళ్లపాటు అడ్రస్ లేకుండా పోయారు. డైరెక్టర్ ఎట్టకేలకు ఓ మెగా హీరో ని పట్టుకుని ఓ మోస్తరు హిట్ కొట్టాడు. ఇక తాజాగా గత ఏడాది మరో మెగా హీరోతో అతడు తీసిన సినిమా మంచి సక్సెస్ అవడంతో మళ్లీ ఓవరాక్షన్ డైరెక్టర్ ఓవర్ కు  అడ్డు అదుపు ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

గత ఏడాది మెగా హీరోతో సినిమా ఇచ్చాక ఆ డైరెక్టర్ ఓవరాక్షన్ మరి గుర్తించి పోయిందట. ఇండస్ట్రీలో మెగా హీరోలకు దిక్కు అని కూడా ప్రచారం చేస్తున్న విషయం మెగాఫ్యామిలీ దృష్టికి వెళ్లడంతో వాళ్ళు సదరు డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సదరు డైరెక్టర్ రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాల తర్వాత మరో స్టార్ హీరో తో చేసిన సినిమా షూటింగ్ టైంలో చేయడంతో స్టార్ హీరో విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ చెంప పై లాగిపెట్టి ఒక్కటి కొట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. ప్రొడ్యూసర్ ఆ విషయాన్ని అప్పట్లో సైలెంట్ చేసినట్లు భోగట్టా.

 

అలా ఒకసారి తన ఓవరాక్షన్ తో ఆ స్టార్ హీరో చేతిలో చెంప దెబ్బ తిన్నా. మళ్లీ ఇప్పుడు వరుస హిట్లు తగలడంతో మళ్లీ రెచ్చిపోయి కాస్త అతి చేస్తూ మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచి వార్నింగ్  ఇప్పించు కున్నాడని ఆ డైరెక్టర్ పై ఇండస్ట్రీ  ఇన్నర్ పార్టీస్ లో ఒకటే జోకులు పేలుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: