సినిమాల్లో డిఫరెంట్ సబ్జెక్టులు, టిపికల్ క్యారెక్టర్లు, ట్రాజెడిక్ ఎండింగ్ లు ఒక్క తెలుగు సినిమాల్లో తప్ప అన్ని భాషల్లో వస్తూంటాయి. డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలంటే కమర్షియల్ యాంగిల్ అనే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. కానీ టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ మాత్రమే ఆ ధైర్యం చేశాడు. ఫలితమెలా ఉన్నా కూడా అలాంటి ప్రయోగాలకు భయపడలేదు. ఇదే విషయాన్ని భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తావించడం గమనార్హం.

 

 

మహేశ్ చేసినన్ని ప్రయోగాలు టాలీవుడ్ లో మరే హీరో చేయలేదు. తండ్రి కృష్ణ నుంచి వచ్చిన వారసత్వం అనుకోవాలో, నటుడిగా కొత్త కొత్త సబ్జెక్టులు ట్రై చేయాలనే ఆలోచనేమో.. మహేశ్ ట్రై చేశాడు. టక్కరిదొంగతో టెక్నికల్ విభాగంలో టాప్ క్లాస్ తీసుకొచ్చాడు. నానీలో చైల్డ్ క్యారెక్టర్, కొంత అడల్ట్ కంటెంట్ నే ట్రై చేశాడు. బాబీ సినిమా మొత్తం సీరియస్ గా కొనసాగి ఓ కొత్త ఫీల్ వస్తుందనుకుంటున్న టైమ్ కి సినిమా ట్రాజెడిక్ ఎండింగ్ అవుతుంది. కథ అలా ఎండ్ అవుతుందని తెలిసినా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని తెలిసినా సబ్జెక్ట్ లో ఉన్న డెప్త్ తో చేశాడు. ఒన్ నేనొక్కడినే సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి.

 

 

సినిమా హిట్ అయితే అలాంటి సినిమాలకు తెలుగులో డిమాండ్ పెరిగేదే.. కానీ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా క్రిటికల్ యాంగిల్ లో చేసి తెలుగులో ఆ సత్తా ఉన్న హీరో-దర్శకులు ఉన్నారని నిరూపించారు. ఈ సబ్జెక్టులన్నీ ట్రై చేయడానికి సాహసం కావాలి. తండ్రి కృష్ణ కూడా ఇటువంటి ప్రయోగాలెన్నో చేశారు. సినీ వారసత్వంతో పాటు ఈ ధైర్యాన్ని కూడా మహేశ్ అందిపుచ్చుకున్నాడనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: