సినీరంగంలో కొన్ని తమషాలు జరుగుతుంటాయి. ఒక సినిమా తెరకెక్కాలంటే ఎన్నో కష్టాలు పడాలి. కథ దగ్గర నుంచి నటీనటుల ఎంపిక, షూటింగ్, విడుదలయ్యేవరకూ ఎన్నో అంకాలు. అన్నీ సజావుగా సాగితేనే సినిమా తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు. అలాంటిదే ఈ పిట్టకథ కూడా. అది 1994-95 కాలం.. టి.కృష్ణ మెమోరియల్‌ పిక్చర్స్‌ అధినేత నాగేశ్వరరావు ‘అమ్మాయికాపురం సినిమా తీయాలనుకున్నారు.

 

 

ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్యను దర్శకుడిగా తీసుకున్నారు. కథ రెడీ అయ్యింది.హీరోయిన్ ఒరియంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కొత్త నటి వేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఆ సమయంలో నిర్మాత నాగేశ్వరరావు శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఫొటోలు దర్శకుడికి చూపించారు. ఆమె శ్రీదేవి చెల్లెలనీ, భారతీరాజా ఓ తమిళ చిత్రంతో పరిచయం చేస్తున్నాడనీ చెప్పారు.

 

 

ముత్యాల సుబ్బయకు ఫొటో చూస్తే పరవాలేదనిపించింది. సరే.. ఒకసారి పిలిపించండి.. చూద్దాం అన్నారట. అయితే అసలు విషయం ఏంటంటే.. దర్శకుడికి చెప్పకుండానే నిర్మాత నాగేశ్వరరారవు మహేశ్వరిని హీరోయిన్ గా బుక్ చేసి చెప్పేశారట. ఇక నిర్మాత ఓకే అనుకున్నాక తప్పేదేముంది. వేరే కారణాల వల్ల సినిమా షూటింగ్ కు ముందు మహేశ్వరిని చూసే అవకాశం దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకు దక్కలేదు.

 

 

చివరకు షూటింగ్ ప్రారంభం రోజు నేరుగా మహేశ్వరి స్పాట్ కు వచ్చిందట. అప్పుడు మహేశ్వరిని చూసి దర్శకుడు సుబ్బయ్య నిర్ఘాంతపోయారట. సన్నగా, పీలగా ఉంది మహేశ్వరి. అందులోనూ మాంచి ఎండల్లో షూటింగ్‌ చేసి వచ్చిందేమో మొహం నల్లగా మాడింది. ఆమెను చూసి ముత్యాల సుబ్బయ్య నీరుకారి పోయారట. అసలే హీరోయిన్ ఓరియంటెడ్‌ సినిమా. హీరోయిన్‌ అందంగా లేకపోతే ఎలా? అనాకారిగా ఉన్న ఈమెతో షూటింగ్‌ చేస్తే సినిమా పరిస్థితి ఏమిటో అని భయపడ్డారట.

 

 

 

నిర్మాతను పిలిచి అదే మాట చెప్పారట. కానీ.. ఆయన నేను మాటిచ్చాడు తప్పదు అనేసరికి సినిమా చేయక తప్పలేదట. అందుకే.. ఛాయాగ్రాహకుడు రామారావుతో మాట్లాడి మహేశ్వరి ఏ యాంగిల్‌లో బాగుంటుందో అలాగే షూట్‌ చేశారట. కానీ ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహేశ్వరికి, దర్శకుడికి మంచి పేరు తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: