సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. వాస్త‌వానికి మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాల్లోనే బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. ఆ త‌ర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచిన రాజకుమారుడిగా.. అమ్మాయిల మదిలో యువరాజుగా తనదైన నటనతో కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోంగ్ పెంచుకున్నారు. ప్ర‌స్తుతం టాప్ హీరోగా వరుస మూవీలతో దూసుకుపోతున్న హీరో ప్రిన్స్ మహేష్. అయితే మ‌హేష్ బాబు కెరీర్ ఘోర‌మైన డిజాస్ట‌ర్ సినిమానే త‌న లైఫ్ ట‌ర్స్ అయ్యేలా చేసింది.

 

అదే వంశీ చిత్రం. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌హేష్ బాబు హీరో నమ్రతా శిరోద్కర్ హీరోయిన్‌గా పద్మాలయా స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కింది. 2000లో విడుద‌లైన ఈ చిత్రం ఘోర డిజాస్ట‌ర్ అయింది. అయితే ఈ సినిమానే మ‌హేష్‌ బాబు, న‌మ్ర‌త శిరోద్కర్ మ‌ధ్య ప్రేమ చిగిరించేలా చేసింది. ఆ త‌ర్వాత అది పెళ్లిగా మారి మ‌హేష్ లైఫ్‌నే అందంగా మార్చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌కి చెందిన ఎవర్‌గ్రీన్ జంటల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఒకరు. 2000లో వచ్చిన ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. 

 

ఇంట్లో వారితో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మహేష్ తండ్రి కృష్ణ, నమ్రత తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు అంటే 2005లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. మహేష్, నమ్రత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇటీవల నమ్రత, మహేష్ తమ 15వ పెళ్లిరోజు సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. అలాగే వీరిద్ద‌రూ చాలా ఇంటర్వ్యూల్లో.. ఒకరికొకరం దొరకడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం అంటూ చెప్పుకొచ్చేవారు. మ‌రియు కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఇస్తాడు కాబట్టే టాలీవుడ్ మోస్ట్ ఫ్యామిలీ పర్సన్ అయిపోయాడు సూపర్ స్టార్. ఇలా డిజాస్ట‌ర్ అయిన వంశీ సినిమానే మ‌హేష్ బాబు జీవితాన్ని మార్చేసింద‌న్న‌మాట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: