యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు వరుసగా రెండో సారి భారీ షాక్ తప్పలేదు. గత ఏడాది  డియర్ కామ్రెడ్ తో డిజాస్టర్ ను చవిచూసిన విజయ్ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ తో మరో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. డియర్ కామ్రేడ్  ఓపెనింగ్స్ అయినా రాబట్టింది కానీ ఫేమస్ లవర్  సింగిల్ డిజిట్ మార్క్ దాటడానికి  నానా తంటాలు పడుతుంది. మూడో రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 7.24కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. విజయ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా వున్న నోటా మొదటివారాంతంలో 10కోట్ల షేర్ ను రాబట్టగా ఫేమస్ లవర్ కనీసం ఆ మార్క్ ను కూడా  క్రాస్ చేయలేకపోయింది. దాంతో నోటా ను వెనక్కి నెట్టి ఫేమస్ లవర్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 
 
ఇక ఫేమస్ లవర్  అటు ఓవర్సీస్ లో కూడా డిజాస్టర్  ఫలితాన్ని రాబట్టింది. 900kడాలర్లను రాబడితే అక్కడ బ్రేక్ ఈవెన్ కానుండగా మూడు రోజుల్లో 200k డాలర్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈచిత్రానికి వస్తున్న కలెక్షన్స్ ను చూసి నిర్మాత కేఎస్ రామారావు తల పట్టుకున్నాడు. 
 
ఫేమస్ లవర్ మూడు రోజుల వసూళ్ల వివరాలు : 
నైజాం - 3.66 కోట్లు 
సీడెడ్ - 66 లక్షలు 
ఉత్తరాంద్ర - 79 లక్షలు  
గుంటూరు - 62 లక్షలు 
తూర్పు గోదావరి - 48 లక్షలు  
పశ్చిమ గోదావరి - 37 లక్షలు 
కృష్ణా - 40 లక్షలు 
నెల్లూరు - 26 లక్షలు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3రోజులకు గాను షేర్ = 7.24 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: