అమ్మ ఆ పిలుపులోని మాధుర్య‌మే వేరు. పెళ్ళైన ప్ర‌తి స్త్రీ త‌ల్లి కావాల‌ని కోరుకుంటుంది. అలా పిలుపించుకోవాల‌ని ఆహ్లాద‌ప‌డుతుంది. అంత గొప్ప సెంటిమెంట్ ఉన్న రిలేష‌నే అమ్మ‌. అమ్మ‌త‌నంలోని తియ్య‌ద‌నం వేరు. ఇక సెల‌బ్రెటీల సైతం ఈ రిలేష‌న్‌కి ఇచ్చే ఇపార్టెన్సే వేరు. మ‌రి బాలీవుడ్ టాప్ స్టార్ విద్యాబాల‌న్ అమ్మ‌త‌నం గురించి ఏం చెబుతుందో చూద్దాం... అమ్మ‌తనం ఓ వ‌రం. పెళ్ల‌యిన ఆడ‌వాళ్లంతా ‘అమ్మ‌’ అనే పిలుపు కోస‌మే ఎదురుచూస్తుంటారు. త‌ల్ల‌య్యానన్న వార్త ప‌దిమందితో పంచుకోవాల‌ని ఉవ్విళ్లూర‌తారు. అయితే అంద‌రూ ఇలానే ఉండాల‌న్న రూల్ ఏమీ లేదు. దీనికి విరుద్ధ‌మైన భావాలున్న అమ్మాయిలూ ఉన్నారు. 

 


విద్యాబాల‌న్ ఆ కేట‌గిరీకే చెందుతుంది.  విద్యాబాల‌న్ త‌ల్లి కాబోతున్న స‌మ‌యంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ చూద్దాం. ఈ నేప‌థ్యం విద్య కాస్త ఘాటుగా స్పందించింది. ఆసుప‌త్రికి వెళ్లి చెక‌ప్‌లు చేయించు కొన్నానంటే.. అది గ‌ర్భం కోస‌మే అని ఎందుకు అనుకోవాలి?? అది త‌ప్ప ఇంకే ఆలోచ‌న‌లూ రావా?? పెళ్ల‌యిన ఆడ‌వాళ్లంతా త‌ల్లులు అవ్వాల్సిందే అని రూలేమైనా ఉందా?? మేమేమైనా పిల్ల‌ల్ని క‌నే యంత్రాల‌మా?? అంటూ ఎవ్వ‌రూ ఊహించ‌ని స‌మాధానాలు చెప్పి షాక్ ఇచ్చింది విద్య‌. ఇప్ప‌టికే దేశంలో జ‌నాభా పెరిగిపోయింద‌ని, కొంత‌మందికి పిల్ల‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన న‌ష్ట‌మేం లేద‌ని, పిల్ల‌ల్ని క‌న‌డం క‌న‌క‌పోవ‌డం త‌మ ఇష్ట‌మ‌ని, త‌మ వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, ఇందులో మీడియా ఓవరాక్ష‌న్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని… ఏంటోంటే మాట్లాడేసింది విద్యాబాల‌న్‌. 

 


సెలబ్రెటీలు, అందునా విద్యాబాల‌న్ లాంటి స్థాయి మ‌హిళ‌లు ‘అమ్మ‌తనం’ గురించి ఈ రేంజులో క్లాసు పీక‌డం కొత్త విష‌య‌మే. అప్ప‌ట్లో ఇదొక హాట్ టాపిక్ అయింది. ఇదేమాట కాస్త సుతి మెత్త‌గా… చెప్పాల్సింది. విద్య ఆవేశం చూస్తుంటే.. మీడియా పై త‌న‌కు పీక‌ల్దాకా కోపం ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. అది ఎందుకు?? అనేదే తెలియ‌డం లేదు. మొత్తానికి పిల్ల‌ల‌పై త‌న ఉద్దేశాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా విద్యాబాల‌న్ మ‌రోసారి వార్త‌ల్లో కి ఎక్కింది. విద్య కామెంట్సే.. టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీగా మారాయి. ఓ ప‌క్క ఇలా అంటూనే ఈ అమ్మ‌డు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లైంది. అంటే దీన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుందిగా అమ్మ అని పిలిపించుకోవ‌డం ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: