తెలుగు చిత్ర పరిశ్రమలో  ఆరడుగుల అందగాడు... అమ్మాయిల కలల రాకుమారుడు...అభిమానుల  సూపర్ స్టార్.. ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాల నటుడిగానే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అభిమానుల నేటి తరం సూపర్ స్టార్ గా మారిపోయాడు. తన అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు మహేష్ బాబు. ఇప్పటికే నాలుగు పదుల వయస్సు దాటి ఐదు పదుల కు దగ్గర పడుతున్న మహేష్ బాబు అందం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.ఏ  హీరోకు సాధ్యంకాని అందం కేవలం మహేష్ బాబు కు మాత్రమే సొంతం. అందుకే అమ్మాయిలందరూ మహేష్ మహేష్ మహేష్ అంటూ కలవరిస్తూ ఉంటారు. 

 


 ఇక ఎన్నో సినిమాల్లో విజయం సాధిస్తూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నారు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ఆరడుగుల అందగాడు.. ఆజానుబాహుడు లా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ... వన్నె తగ్గని అందంతో ప్రతి సినిమాలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అయితే మహేష్ బాబుకు బట్టతల ఉందా అంటే... ఎవరైనా ఏం చెప్తారు... సూపర్ స్టార్ మహేష్ బాబుకు బట్టతల ఏంటండీ చక్కగా జుట్టు ఉంటేను.. అంటారు.. కానీ ఒకప్పుడు మాత్రం మహేష్ బాబు బట్టతల ఉండేదని ఎంతగానో ప్రచారం జరిగింది. మహేష్ బాబు బట్ట తల ఏర్పడితే హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నారని అందుకే ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ తో ఉంటారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. 

 

 అంతేకాదండోయ్ మహేష్ బాబు  బట్టతల ఉంది అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పలు వీడియోలు హల్ చల్ చేశాయి కూడా. ఆ వీడియోల్లో  మహేష్ బాబు బట్టతలతో కనిపించడం లాంటి ఫోటోలు కూడా ఉన్నాయి. కాగా కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు మహేష్ బాబుకు ఎక్కడ బట్టతల వచ్చినట్లు కూడా కనిపించలేదు.అన్ని సినిమాల్లో  మహేష్ బాబు సేమ్ హెయిర్ స్టైల్ తో స్టైల్ తో  ఉంటారు. మరి యూట్యూబ్ లో ఉన్న ఫోటోలు ఎందుకు ఉన్నాయి అంటే... ఈ మధ్య సెలబ్రిటీల పైన ఫేక్ ఫోటోలు వస్తూనే  ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు బట్టతల ఉంది అంటూ ఫేక్ ఫోటోలను కూడా సృష్టించి ఉండవచ్చు మరి. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: