టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే తర్వాతి సినిమా సూపర్ హిట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు టాలీవుడ్ లో మహేష్ పేరుని కొందరు యువ దర్శకులు ఆయన పేరుని జపిస్తున్నారు అనేది వాస్తవం. ఆ హీరోహీరో అభిమానులు అనేది లేకుండా మహేష్ సినిమాలు చూస్తారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కోసం టాలివుడ్ తో పాటుగా బాలీవుడ్ దర్శకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. 

 

మహేష్ తో సినిమా చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు దర్శకులు. అయితే మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కరణ్ జోహార్, బోని కపూర్ లాంటి నిర్మాతలు మహేష్ తో సినిమా విషయంలో చాలా వరకు దూకుడుగానే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదని అంటున్నారు. ఇక అక్కడి దర్శకుల్లో చాలా మంది తెలుగులో సినిమా చేస్తే మహేష్ తో చెయ్యాలని భావిస్తూ ఉంటారు. తమిళ దర్శకులు కూడా మహేష్ విషయంలో అలాగే ఉంటారు. 

 

దీనికి కారణం మహేష్ కి ఉన్న క్రేజ్ ఏ కారణం. సినిమా హిట్ ఫ్లాప్ అనే దానితో సంబంధం లేకుండా ఆయనతో సినిమా చేస్తే ఫ్లాప్ అయినా సరే వసూళ్లు వచ్చేస్తాయని నిర్మాతలు, సినిమా హిట్ అయితే చాలు తెలుగులో కూడా అడుగు పెట్టవచ్చు అది గ్రాండ్ గా అని దర్శకులు భావిస్తున్నారు. అందుకే మహేష్ తో సినిమా చెయ్యడానికి బాలీవుడ్ దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అటు మహేష్ గ్లామర్ కూడా నేషనల్ వైడ్ గా వర్కౌట్ అవుతుంది. దీనితోనే మహేష్ కోసం అక్కడి నిర్మాతలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని మహేష్ మాత్ర౦ తెలుగు దాటి వెళ్ళడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: