ఈ మద్య తెలంగాణ పోలీసుల దూకుడు చూస్తుంటే మాములుగా లేదని.. నేరస్తులను అతి కొద్ది కాలంలోనే పట్టుకొని కట కటాల వెనుకకు పంపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల దిశ కేసులో పోలీసులు నలుగురు నింధితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.  కేసు దర్యాప్తు విషయంలో నింధితులను స్పాట్ వద్దకు తీసుకు వెళ్లగా వారు తిరగబడి తమపై దాడి చేయడం వల్ల ఎన్ కౌంటర్ చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.  అయితే దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. ఒక డాక్టర్ ని దారుణంగా అత్యాచారం చేసి ఆపై నిప్పంటించి చంపిన దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేయడం పోలీసులపై హర్షాతి రేఖలు వెల్లువెత్తాయి.   అలాంటి నింధితులకు దేవుడు పోలీసుల రూపంలో సరైన శిక్ష వేశాడని ప్రశంసలు దక్కాయి.  మరికొన్ని అత్యాచార కేసులను కూడా పొలీసులు త్వరితగతిన ఛేదించిన విషయం తెలిసిందే.  తాజాగా తెలంగాణ పోలీసులకు ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ ధన్యవాదాలు తెలిపారు. 

 

వివరాల్లోకి వెళితే.. తాను నివాసం ఉంటోన్న జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి సమయంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, భారీ శబ్దాలు వస్తున్నాయని దాంతో తమ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు చుట్టు పక్కల ఉన్న వారికి కూడా ఎంతో ఇబ్బంది... అసౌకర్యం ఉన్నట్లు ఆయన పోలీసులకు ట్విట్ చేశారు.  హరీష్ శంకర్ ట్విట్ కి వెంటనే స్పందించిన పోలీసులు  వెంటనే హరీష్ శంకర్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు వెళ్లి భవన నిర్మాణ పనులు నిలిపేలా చేశారు. తాజాగా పోలీసులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడమై హర్షం వ్యక్తం చేశారు హరీష్ శంకర్.  ఈ సందర్బంగా ఆయన ట్విట్ చేస్తూ.. నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి' అని పేర్కొన్నాడు.

 

జూబ్లీ ఎన్‌క్లేవ్‌ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు. నిజమే.. పోలీసులు తల్చుకుంటే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తారు.. కష్టమోస్తే ఎక్కడికైనా వచ్చి మేం ఉన్నాం అని భరోసా ఇవ్వగలరు.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎప్పుడైనా రాగలరని నిరూపించారని అన్నాడు. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజలు మరింత బాధ్యతగా మెలిగేలా చేశారని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: