మహేష్ బాబు... ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో. ప్రిన్స్ గా అడుగుపెట్టి సూపర్ స్టార్ అయ్యాడు. తన తండ్రి కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. వివాదాలకు దూరంగా ప్రయోగాలకు దగ్గరగా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మంచి దర్శకులతో సినిమాలు చేయడమే కాకుండా చేసే సినిమా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ స్టార్ హీరో. ఇది పక్కన పెడితే మహేష్ సినిమాల్లో హిట్ అయిన ప్రతీ సినిమా కూడా దాదాపుగా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అనేక రికార్డులను కొల్లగొట్టాయి. 

 

ముఖ్యంగా మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఒక్కడు. ఈ సినిమాతో మహేష్ బాబు కెరీర్ ఊపందుకుంది. ఒక్కడు సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో మహేష్ నటన అభిమానులను ఫిదా చేసింది. ప్రకాష్ రాజ్ లాంటి నటుడ్ని కెరీర్ మొదట్లోనే మహేష్ బాబు ఎదుర్కొన్నాడు. అతనికి పోటీగా నటించి మెప్పించాడు. ఇక భూమిక తో మహేష్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది అనే చెప్పుకోవాలి. ఆ సినిమాలో ఆ ఇద్దరి మధ్య సిన్స్ హైలెట్ గా నిలిచాయి. 

 

ఆ తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి ఎందరో స్టార్ దర్శకులు పోటీ పడ్డారు. ఆ తర్వాత రెండు మూడు ఫ్లాపులు వచ్చినా సరే మహేష్ కి ఒక్కడు సినిమా ఇచ్చిన బూస్ట్ బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కెరీర్ గాడిలో పడిపోయింది. వరుస సినిమాలు చేస్తూ జాగ్రత్తగా దర్శకుల ఎంపిక చేసుకుంటూ మహేష్ ముందుకి వెళ్ళాడు. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు కమర్షియల్ హీరోగా కూడా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత మహేష్ బాబుకి పలు యాడ్స్ కూడా వచ్చాయి. స్టార్ నిర్మాతలు కూడా మహేష్ లోని నటుడ్ని చూసి ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: