అమ్మాయిల కలల రాకుమారుడిగా పిలవబడే టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇప్పటికీ కుర్ర యువతులను తన అందం అభినయంతో ఫిదా చేస్తుండడానికి కారణం ఏమిటో తెలుసా? తమ నాన్న, అమ్మ గారి నుంచి వచ్చిన అందం, జీన్స్ తో పాటు అతను ఎంతో క్రమశిక్షణతో తీసుకునే ఆహారం అతనిని ఇప్పటికీ అందంగా, యువకుడిలా ఉండేందుకు సహాయ పడుతున్నాయి. మరి మహేష్ బాబు యంగ్ గా కనిపించేందుకు ప్రత్యేకంగా ఫాలో అవుతున్న డైట్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


టాలీవుడ్ సూపర్ స్టార్ జిమ్ కు ఒక్క రోజు కూడా వెళ్లకుండా ఉండలేరు. అలాగే ఒక పూట భోజనం కూడా మిస్ అవ్వడట. అయితే రోజుకు 5 నుంచి 6 సార్లు మహేష్ బాబు తింటాడని అతడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రోజుకి తరచూ తింటూ అలాగే కొద్ది కొద్ది మొత్తంలో తింటే బాడీలో బరువు పెరగడంతో పాటు మెటబాలిజమ్ సరిగా పని చేస్తోందని అతను ఈ విధంగా తింటారని తెలుస్తుంది. అతని బ్రేక్ ఫాస్ట్ లో విటమిన్లు ఇంకా అన్ని పోషకపదార్థాలు ఉండేలా మహేష్ బాబు చూసుకుంటాడట. ఉదయం పూట ఆహారంలో ఓట్స్, గుడ్లు అలాగే ఫ్రూట్స్, నట్స్ బాగా తింటాడు. అలాగే వ్యాయామం చేయగానే ఒక ప్రోటీన్ షేక్ తాగుతాడు. మధ్యాహ్న భోజనంలో ఫిష్/చాప, గొర్రె, చికెన్ తో కూడిన బ్రౌన్ రైస్ తింటాడు. ఇక రాత్రి భోజనానికి ఒక బ్రెడ్, చికెన్ భోజనం తింటాడు.



ఈ విధంగా అతను ఓ ప్రత్యేకమైన రోజువారి డైట్ ను ఫాలో చేస్తూ ఫిట్ గా ఉండేందుకు కట్టపడతాడట. అందుకే నాలుగు పదుల వయసు దాటినా మహేష్ బాబు మాత్రం ఎప్పటికీ కుర్ర హీరోల కంటే ఎక్కువ ఫిట్నెస్ ని మెయిన్ టైన్ చేస్తున్నాడు. సో, ఇలా మితంగా తింటూ రోజులో ఎక్కువ సార్లు తింటే మహేష్ బాబు లాగా ఫిట్నెస్ వస్తుంది. అలాగే ఊబకాయం లాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: