తెలంగాణ కోసం పోరాటం చేసి అప్పటి యూపీఏ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఈ రోజు ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  తెలంగాణ పోరాట యోధుడు   కేసీఆర్ ప్రస్తుతం రెండవ పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు నెరవేరుస్తున్నారు.   గతంలో జరిగిన ఎన్నికల్లో విజయఢంగా మోగించిన టీఆర్ఎస్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సైతం విజయ దుంధిబి మోగించారు. ఇక టీఆర్ఎస్ ని ఓడించాలని కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిగా నిలిచి పోరాడింది.  కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ది పనులకే మరోసారి పట్టం కట్టారు.

 

అప్పటి నుంచి మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ కే పట్టం కడుతూ వస్తున్నారు.  తెలంగాణ జాతిపితగా చిరస్థాయిగా మీ పేరు నిలిచిపోతుందని ఎంతో మంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రగతిభవన్‌కు కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నేతలు క్యూకడుతున్నారు. ఇక ఏడేళ్ల క్రితం జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యాంకర్ అనసూయ.

 

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో ప్రతి విషయంపై స్పందిస్తున్న విషయం తెలిసిందే.  అంతే కాదు సెలబ్రెటీలకు కూడా ఆమె ప్రత్యేక విషెస్ చెబుతుంటారు.  నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు యాంకర్ అనసూయ.  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది అనసూయ భరద్వాజ్. హ్యాపీ బర్త్ సీఎం సర్ అని.. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సర్ అంటూ ట్వీట్ చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: