ఈ మద్య అన్ని సినీ ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇలాంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.  మల్టీస్టారర్ చిత్రాల్లో హీరోల మద్య సన్నివేశాలు చాలా కేర్ ఫుల్ గా డీల్ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే.  ఇద్దరు హీరోల రేంజ్ ఏమాత్రం తగ్గకుండా చాలా పకడ్భందీగా వ్యవహరిస్తున్నారట రాజమౌళి.  తాజాగా తమిళ నాట ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే చిత్రంలో విజయ్ సేతుపతి సరసన స్టార్ హీరోయిన్లు సమంత, నయనతారలు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.   

 

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు సమంత, నయనతార.  ఇక నయనతార విషయానికి వస్తే..  దక్షిణాదిన ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ ఇద్దరూ ఒకే తెరపై సందడి చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'కాతు వాకుల రెండు కాదల్' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  పూర్తి వినోదభరితంగా సాగే ఈ చిత్రం వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ చిత్రం నిర్మితమవుతుంది.

 

ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చాలా సన్నివేశాలే ఉంటాయట.  కథలో హీరో కోసం ఇద్దరికీ పెద్ద ఫైట్ జరుగుతుందట.  ఇద్దరి మధ్యన నలిగిపోయే హీరో విజయ్ పాత్రలో కడుపుబ్బా నవ్వించబోతున్నారట. మార్చి నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయనున్నాడు.  గత కొంత కాలంగా విజయ్ సేతుపతికి తెలుగు, తమిళ, మళియాళంలో మంచి ఆదరణ లభిస్తుంది.  దక్షిణాదిన నయనతార, సమంతలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోను ఈ చిత్రం  విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: