టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి మహేష్ బాబు సినిమాలు . ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా మహేష్ బాబు దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా  టాలీవుడ్కి ఎంట్రి ఇచ్చి నేటితరం అభిమానుల సూపర్ స్టార్ గా మారిపోయారు మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడిగా తనని తాను నిరూపించుకున్నారు. తన మొన్నటికి  మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. 

 


 ఇంకొన్ని రోజుల్లో మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. అయితే స్టార్ హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే... అయితే ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న స్టార్ హీరోలకు కూడా ఫేవరెట్ హీరోలు ఉంటారు. ఈ నేపథ్యంలోనే తమ అభిమాన స్టార్ హీరో యొక్క  ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకుందామని అభిమానులు నెటిజన్లు అందరూ ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఆత్రుత అందరికీ ఉంటుంది. మీ  పేరేంటి హీరో ఎవరు అని ఒకానొక సమయంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబును యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఫేవరెట్ హీరో ఎవరనే  ఆసక్తికర సమాధానం చెప్పారు మహేష్ బాబు.. 

 


 తన ఫేవరెట్ హీరో హల్క్... ఇంగ్లీష్  సినిమాలు అంటే ఎంతో  ఇష్టమంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అలాంటి పాత్రలు వస్తే నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ మహేష్ బాబు తెలిపారు. అంతేకాకుండా హల్క్ అవెంజర్స్ లాంటి సినిమాలు చూడడానికి ఎంతో ఇష్టపడతానని.. ఇంట్లో పిల్లలతో కలిసి అవెంజర్స్ హాల్కు లాంటి సినిమాలు చూస్తూ ఉంటాను అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే మహేష్ బాబు ఫేవరెట్ హీరో అని తెలుసుకోవాలని ఆత్రుత తో ఉన్న  అభిమానులందరికీ తన ఫేవరెట్ హీరో హల్క్ అని చెప్పేసారు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: