జూనియర్ ఎన్టీఆర్ న్యూ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇన్నాళ్లూ చేసిన పాత్రలు, ప్రయాణాలు పక్కనపెట్టి కొత్తకొత్త మార్పులకు ఒకే చెబుతున్నాడు. రెగ్యులర్ హీరోయిజానికి బ్రేకులేస, కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడు. సాదాసీదా క్యారెక్టర్స్ గా మారుతున్నాడు తారక్. 


జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ హీరో విన్యాసాలకు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తుంటారు. అలాంటి హీరో.. హీరోయిజాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే హీరోయిజానికి దూరంగా దూరంగా నార్మల్ లుక్ లోకి వెళ్లిపోతున్నాడు. చిన్నచిన్న కథాంశాలతో పెద్ద పెద్ద విజయాలు సాధించే వెట్రిమారన్ లో సినిమా చేయబోతున్నాడు తారక్. 

 

వెట్రిమారన్ సినిమాలన్నీ చాలా సింపుల్ పాయింట్ తో తెరకెక్కుతాయి. గాల్లోకి సుమోలు ఎగరడం, భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు దూరంగా మన చుట్టూ జరిగే అంశాలతోనే సినిమాలు తీస్తాడు. హీరోని కూడా చాలా సింపుల్ గా ప్రజెంట్ చేస్తాడు. అందుకే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా అసురన్ తో అదరగొట్టాడు. ఈ కథకే ఫిదా అయిన తారక్ తర్వాత వెట్రిమారన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. 


జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు జై లవకుశ సినిమాలో నత్తినత్తిగా మాట్లాడే పాత్ర చేశాడు. ఈ రావణ పాత్రతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు వెట్రిమారన్ తో సినిమా.. ఇక ఈ దర్శకుడి సినిమాల్లో హీరోలకు కాస్ట్యూమ్స్ కూడా సరిగా ఉండవు. మిడిల్ క్లాస్ లుక్ లోనే ఉంటాడు. సో ఈ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ఓ కొత్త తారక్ ని చూస్తారని చెప్పొచ్చు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. నార్మల్ స్టోరీస్ బోర్ కొట్టాయో ఏమో గానీ.. నార్మల్ లైఫ్ ను వ్యక్తపరిచే స్టోరీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: