టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా అతని కెరీర్ లో మాత్రం కొన్ని సినిమాలు మైలురాయి గా నిలిచిపోయాయి. ఒక్కడు, పోకిరి వంటి సినిమాలు మహేష్ ఫాన్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేశాయి. ఆ సినిమాతో మహేష్ బాబు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే మహేష్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ముఖ్యంగా మాస్ క్లాస్ ని మహేష్ విశేషంగా ఆకట్టుకున్నాడు ఈ సినిమాతో. అప్పటి వరకు మహేష్ అంటే క్లాస్ సినిమాలు మాత్రమే చేస్తాడు అనే అభిప్రాయం ఉండేది. 

 

అంటే మాస్ సినిమాలను అంత దూకుడుగా చేయలేడు అనేది సిని జనాల అభిప్రాయం. కాని మహేష్ బాబు ఈ సినిమాతో దాన్ని దాదాపుగా చేరిపెసాడు అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మహేష్ నటన ఆకట్టుకుంది. అదే విధంగా నటనలో వైవిధ్యం చూపించాడు. కంప్లీట్ యాక్టర్ ని చూపించాడు మహేష్. ఈ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు. ప్రతీ సీన్ లో కూడా మహేష్ నటన కుర్ర కారుని ఊపేసింది అనే చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్ లో కూడా గ్లామర్, యాక్షన్ ని సమానంగా చూపించాడు. 

 

పూరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా నటించాడు. ఇక భావోద్వేగాల విషయంలో క్లైమాక్స్ లో మహేష్ నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇలా ఈ సినిమాతో ఎన్నో విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. అక్కడి నుంచి మహేష్ మాస్ సినిమాలు కూడా చేస్తాడు అనే అభిప్రాయం సిని జనాల్లో బలపడుతు వచ్చింది. ఇక ఇలియానా తో మహేష్ చేసిన కొన్ని సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి అనే చెప్పాలి. ఇలా పొకిరీ సినిమా మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: