ఇండస్ట్రీలో క్రేజ్ వున్న ఏ హీరోకు అయినా సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు... తొలి వారాంతం.. తొలి వారంలో మంచి వసూళ్లు వస్తూ ఉంటాయి. సినిమా ప్లాప్‌ అయినా కూడా తొలి వారంలో దాదాపుగా 50 నుంచి 60 శాతం రికవరీ అవుతుంటాయి. అంతకు మించి వ‌సూళ్లు వ‌స్తే ఆ సినిమా హిట్ కింద లెక్క. అయితే తొలి వారాంతంలో 40 శాతం రెవెన్యూ కూడా రాకపోతే ఆ సినిమా హిట్ అయినా నిర్మాతలకు వచ్చే లాభం ఉండదు. ఇక ప్లాప్ అయితే సోమవారం నుంచే నిర్మాతలు తమ సినిమాకు వచ్చే నష్టాలు ఎంతో లెక్కలు వేసుకోవాలి.

 

తాజాగా  యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి దాదాపు ఇదే. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాను వరల్డ్ వైడ్ 30 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇంకా చెప్పాలంటే నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కూడా క‌లుపు కుంటే ఈ సినిమాకు రిలీజ్ కు ముందే ఏకంగా రు.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు తొలి రోజే ప్లాప్ టాక్ వ‌చ్చింది.

 

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమా మ‌రో రు.22 కోట్ల షేర్ రాబ‌డితే బ్రేక్ ఈవెన్‌కు వ‌స్తుంది. ఇప్పుడున్న డిజాస్ట‌ర్ టాక్‌తో ఈ సినిమా ఎంత మాత్రం బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చే ఛాన్స్ లేదు. మొదటి రోజు ఈ సినిమాకు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక రెండో రోజు ఏకంగా 60 శాతం డ్రాఫ్ కనిపించింది. మూడో రోజు ఆదివారం అయినా మ‌రీ ఘోర‌మైన వ‌సూళ్లు వ‌చ్చాయి. సో ఓవ‌రాల్‌గా చూస్తే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ విజ‌య్ కెరీర్‌లో మ‌రో ఘోర‌మైన డిజాస్ట‌ర్ సినిమాగా మిగిలి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: