శ్రీమంతుడు సినిమా వరకు టాలీవుడ్ లో సామాజిక కోణంలో సినిమాలు చెయ్యాలి అంటే కాస్త హీరోలు ఆలోచించే వారు. ఒకటికి పది సార్లు ఆలోచించి కథలకు ఓకే చెప్పేవారు. అయితే శ్రీమంతుడు సినిమా తో ఆ ట్రెండ్ ఒక్కసారిగా మారిపోయింది అనే చెప్పాలి. సామాజిక కోణంలో సమాజం పై దృష్టి పెట్టి సినిమాలు తీయడం అనేది అక్కడి నుంచి కాస్త గట్టి గా స్టార్ట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఊరి సమస్యను టేకప్ చేసిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. 

 

ఆ తర్వాతి నుంచి మహేష్ బాబు సామాజిక కోణంలో మంచి సినిమాలు చేసాడు. ఈ సినిమాలు అటు మాస్ ని ఆకట్టుకున్నాయి. ఇటు క్లాస్ ని ఆకట్టుకున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. భరత్ అను నేను, మహర్షి కూడా అదే జోనర్ లో వచ్చాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అలాగే వచ్చింది దాదాపు. ఈ సినిమాలో సైనికుల గురించి అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలు అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకోవడంతో మహేష్ బాబు ఇక ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 

 

అలాంటి కథతో ఎవరైనా వస్తే చాలు మహేష్ బాబు వెంటనే ఓకే చేస్తున్నాడు. ఎక్కడా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నాడు. దర్శకులు కూడా అలాంటి కథలు ఉంటే ముందు మహేష్ ని సంప్రదిస్తున్నారు. అలా టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో మహేష్ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. ఆ తర్వాత రైతులపై, గ్రామాలపై, సమాజంపై పలువురు ఆసక్తి చూపించారు. కొందరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మహర్షి సినిమాతో రైతులను, శ్రీమంతుడు సినిమాతో ఊర్లను బాగు చేయడానికి యువత ముందుకి వచ్చింది. భవిష్యత్తులో అతని ఇలాంటివి మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుందా౦.

మరింత సమాచారం తెలుసుకోండి: