మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఖలేజా సినిమా ఫ్లాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి చేసిన వ్యాఖ్య ఇది. మహేష్ బాబు నటనలో ఫెయిల్ అయ్యే అవకాశమే లేదని అప్పట్లో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు తమకు ఉన్న స్టార్ ఇమేజ్ తో నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. కాని మహేష్ బాబు తనకు ఉన్న స్టార్ ఇమేజ్ ని నటనతో కాపాడుకుంటూ వస్తున్నాడు. దర్శకుడికి ఎం కావాలో అది స్పష్టంగా ఇస్తున్నాడు మహేష్ బాబు. 

 

ఖలేజా సినిమా లో కొన్ని సీన్స్ లో మహేష్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు దూకుడు, బిజినెస్ మాన్ వంటి సినిమాల్లో మహేష్ నట విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. ఇక టాలీవుడ్ లో మహేష్ ని నటన విషయం లో బీట్ చేసే వారు ఎవరూ లేరని సిని విమర్శకులు కూడా అన్నారు. ఎమోషనల్ సీన్స్ లో సరిగా నటించలేకపోయేవాడు మహేష్ అనే వారు. కాని మహేష్ ఈ మధ్య కాలంలో ఆ విమర్శనే ఎప్పుడు ఎదుర్కున్న సందర్భం ఎక్కడా లేదనే చెప్పాలి. 

 

నటనలో వైవిధ్యం తనదైన కోణంలో చూపించడం మహేష్ బాబు స్టైల్. స్పైడర్ సినిమా ఫ్లాప్ అయింది గాని ఆ సినిమాలో మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఒకవేళ సినిమాలో కథ బలంగా లేకపోతే మాత్రం మహేష్ తో నెట్టుకు వచ్చేయొచ్చు సినిమా మొత్తాన్ని అంటూ ఉంటారు. టాలీవుడ్ లో ఎందరో దర్శకులు మహేష్ నటన గురించి చెప్పారు. వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ కొన్ని కొన్ని సీన్స్ లో పిచ్చేక్కించాడు అంటూ ఇప్పటికీ అంటూ ఉంటారు. ఆ సినిమాలో తనలో ఉన్న డాన్సర్ ని కూడా మహేష్ బాబు బయటకు తీసుకోచ్చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: