టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేవి కొన్ని ఉంటాయి. హీరోకి నటన వచ్చినా రాకపోయినా సరే ఆ హీరో యాక్షన్ సీన్స్ లో నటిస్తే నలుగురికి తుక్కు తుక్కుగా కొట్టినా, వంద మందిని చంపినా సరే అభిమానులు పొంగిపోతారు. నటన ఎలా ఉన్నా సరే వారికి అనవసరం. అందుకే మన వాళ్లకు ప్రయోగాలు పెద్దగా ఎక్కే పరిస్థితి ఉండదు అనే విషయం స్పష్టమవుతుంది. అందుకే అందరికి నచ్చిన అతడు సినిమా మన ప్రేక్షకులకు ఎక్కలేదు. కాని ఆ సినిమాను సినిమాలా చూస్తే అందరికి నచ్చుతుంది. 

 

కాని ఆ సినిమాను మన వాళ్ళు సినిమాలా చూడలేదు. చివరికి బెస్ట్ కామెడి ఫిలిం ని చూసారు. కాని అతడు సినిమా మాత్రం చాలా మంది విషయం ఉన్న వాళ్లకు నచ్చింది. సినిమా టీవీ లో వస్తే ప్రతీ సీన్ ని చూస్తారు. ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టదు ఆ సినిమా. త్రివిక్రమ్ మాటలు, మహేష్ నటన, త్రిష అభినయం, ఇతర నటులు చేసే కామెడి, ఇప్పటికి అతడు సినిమాను కొట్టిన సినిమా టాలీవుడ్ లో రాలేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రతీ ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. 

 

సిబిఐ విచారణ ఇలా ఉంటుందా... హత్యలు ఇలా చేస్తారా, ఫ్యామిలీ లైఫ్ ఇంత అందంగా ఉంటుందా...? అత్తయ్య ప్రేమ ఇలా ఉంటుందా...? ఒక మరదలు ఉంటే ఇలా ఉంటుందా...? నమ్మక ద్రోహం అంటే ఇలా ఉంటుందా...? సినిమాలో ట్విస్ట్ లు అంటే ఇలా ఉంటాయా అనిపించినా అది. ఇప్పటికి కూడా ఆ సినిమా వేస్తే మా టీవీ వాళ్లకు రేటింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే అతడు సినిమా ఎప్పుడు చూసినా సరే కొత్తగానే ఉంటుంది. ఎన్ని సార్లు చూసినా సరే చూడాలనిపించే విధంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: