ఎవరైనా ఎర్రగా, బుర్రగా ఎత్తుగా వుంటే మహేష్‌బాబులా వుంటావని అంటుంటారు. అంటే మహేష్‌బాబు అంత గ్లామర్‌గా వుండటానికి చాలా కసరత్తే జరిగింది. చిన్నతనంలోనే కృష్ణగారు కొడుకు కోసం చాలా జాగ్రత్త‌లు తీసుకునేవారు. కృష్ణగారితో కలిసి కామెడీ పాత్రలు చేసిన నటుడు మాడా. మహేష్‌ యుక్త వయస్సు నుంచి తను ఎక్కడికి వెళ్ళిన పక్కనే మాడా వుండేవాడు. మాడా జోకు వేయడంలో ఘనాపాటి. స్పాంటేనియస్‌గా డైలాగ్ చెప్పేస్తాడు. ఎదుటివాడు ఏదైనా మాట్లాడితే వెంటనే ఛ‌లోక్తి విసరడంలో దిట్ట అని చెప్పాలి.

 

 అందుకే మహేష్‌ ఏ ఊరు వెళ్ళినా మాడా వెంటే వుంటూ జోక్స్‌ వేసేవాడు. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ వుండడంతో బాడీలోని హార్మోను యాక్టివ్‌గా వుంటూ బ్రెయిన్‌ షార్ప్‌గా వుంటుంది. మొఖంలో నవ్వు, అందం చెక్కుచెదరకుండా వుంటుంది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణగారు వెల్ల‌డించారు. విజయవాడకు పనిమీద వస్తే అప్పట్లో త్రిస్టార్‌ హోటల్‌లో 707 అనే సూట్‌ రూమ్‌లో కృష్ణగారు వుండేవారు. మహేష్ వచ్చినా ఆ రూమ్‌నే హోటల్‌వారు కేటాయించేవారు. ఇలా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అయ్యే మహేష్‌బాబుకు ఆమధ్య చిన్నపాటి తల‌నొప్పి వచ్చింది. అప్పుడు డ‌ప్పుడు పార్శ్వపు నొప్పిరావడంతో మహేష్‌ భార్య నమ్రత దాన్ని సీరియస్‌గా తీసుకుని డాక్టర్లను సంప్రదించినా సరైన మార్గం కన్పించలేదు. 

 

ఆఖరికి నాడీ వ్యవస్థకు చెందిన ఓ లేడీ డాక్టర్‌ చేతి వేళ్ళ ద్వారా మెడిటేషన్‌ద్వారా దాన్ని సాల్వ్ చేయించారు. ఈ విషయాన్ని మహేష్‌ స్వయంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించాడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దల‌నేవారు అని ఆయ‌న ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌రిలేరు చిత్రం విజ‌యం సాధించ‌డంతో ఆ ఆనందోత్సాహంలో ఉన్నారు. ఆయ‌న మ‌రో మూడు నెల‌ల‌పాటు రెస్ట్‌లో ఉంటారు ఫ్యామిలీతో క‌లిసి మ‌హేష్‌కు మైన‌ర్ ఆప‌రేష‌న్ ఉంటే విదేశాల్లో ఉన్నారు.  ఆ త‌ర్వాత మ‌హేష్ రాగానే చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: