తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బాల నటుడిగానే ఎన్నో సినిమాల్లో నటించి అప్పట్లోనే తన నటనతో మెప్పించిన మహేష్ 1998లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో మహేష్ బాబు టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తనతో పాటు హీరోయిన్ గా నటించిన పెళ్లి చేసుకున్న మహేష్ హీరోగా 25 సినిమా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ చూడటానికి క్లాస్ హీరోగా కనిపిస్తాడు. అతడికి కనపడని అభిమానులు ఉన్నారు. మహేష్ సినిమా వస్తుందంటే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ షేక్ అవుతుంది.

 

పోకిరి సినిమాలో నీకంటే తోపు ఎవ్వడూ లేడు ఇక్కడ అన్నట్టుగా ఒక మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు సినిమాకు ఉన్న కోట్లాది మంది అభిమానులు సైతం ఇదే డైలాగ్ తో మహేష్ ను చూస్తుంటారు. క్లాస్, మాస్, లేడీస్, యూత్ ఆంధ్ర, నైజాం, తెలంగాణ, ఓవర్సీస్, దుబాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్లేస్ ఏదైనా  మహేష్ కు ఉన్న అభిమానులు మాత్రం కోట్లలో ఉన్నారు. అందుకే మహేష్ సినిమా వస్తుందంటే సినిమా రిలీజ్ కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న మహేష్ ను ఇప్పట్లో హీరో ఎవరూ లేరనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: