సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా నీడ సినిమాతో తెరంగేట్రం చేసిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా చేశాడు. ప్రిన్స్ గా ఉన్న మహేష్ సూపర్ స్టార్ గా మారాడు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తన టాలెంట్ తో మెప్పిస్తూ వచ్చిన మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. 26 సినిమాల కెరియర్ లో మహేష్ మాత్రమే చేయగలడు అనిపించేలా సినిమాలు చేశాడు మహేష్. మురారితో కమర్షియల్ హిట్ అందుకున్న మహేష్ ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నాడు. 

 

దర్శకులకు సరెండర్ అయ్యే హీరోల్లో మహేష్ కూడా ఒకరు. కథ ఓకే చెప్పిన దగ్గర నుండి సినిమా పూర్తయ్యే వరకు దర్శకుడు చెప్పింది మాత్రమే చేసే హీరో మహేష్. ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ అయ్యే క్రమంలో మహేష్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. కేవలం ఒక జానర్ అని ఫిక్స్ అవకుండా కమర్షియల్ సినిమాలకు కొత్త రూపు రేఖలు తెచ్చిన హీరో మహేష్. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడుగా లేడీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. 

 

కేవలం తెలుగు సినిమాలే చేస్తున్నా మహేష్ కు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు రీమేక్ సినిమాలను చేయకుండా ఉన్న అతి కొద్దిమంది హీరోల్లో మహేష్ ఒకరు. మహేష్ సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడతారు. ఎప్పుడు ప్రయోగాలకు పెద్దపీట వేసే మహేష్ భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్న మహేష్ రాగానే వంశీ పైడిపల్లి మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో మహేష్ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: