అష్టాచమ్మా సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో నానిసినిమా మంచి ఘన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.నానికి ఈగ సినిమా మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది.అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ నానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. నేను లోకల్, జెర్సీ, నిన్ను కోరి, జెంటిల్ మెన్ చిత్రాలు విజయం అందుకోవడంతో నాని ఇంకా వెనక్కి తిరిగి చూసుకొనే పనిలేకుండా చేశాయి.

 

మొన్న ఆమధ్య వచ్చిన ఎంసీఏ చిత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. దాంతో కొంచం గ్యాప్ తీసుకున్న నాని జెర్సీ సినిమాలో నటించారు. ఈ సినిమా నాని 25 వ చిత్రంగా రూపొందింది. మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నాని సినీ లైఫ్ ను మరింత పెంచింది. ఆ సినిమా తర్వాత వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్ కూడా నానికి పాజిటివ్ టాక్ ను అందించింది. ఇకపోతే ప్రస్తుతం నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తున్నా చిత్రం ' వి'.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

 

 

నివేదా థామస్, అతిధి రావు హైదరి కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా విలన్  నాని నటించగా, పొలిసు పాత్రలో సుధీర్ కనిపించనున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలయిన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకోగా, తాజగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. టైటిల్ కు తగ్గట్లే సన్నివేశాలని చూపిస్తూ టీజర్ ను కట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ విలన్ పాత్రలో నాని కనిపించగా, అతన్ని పట్టుకొనే  పోలీసుగా సుధీర్ కనిపిస్తున్నారు.

 

ఎదో స్కామ్ ను ఛేదింస్తున్నట్లు టీజర్ ఉంటుంది. మొత్తానికి విలన్ పాత్రలో కూడా నాని ఆకట్టుకునేలా ఉన్నాడని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. మార్చి 25 న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి విలన్ పాత్రలో మొదటి సారిగా కనిపిస్తున్న నానికి ఈ సినిమా ఏ మాత్రం హిట్ ని అందిస్తుందో చూడాలి.ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: