సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. ఇక మ‌ళ్లీ రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచ‌మ‌య్యాడు. అలా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. ప్ర‌స్తుతం స్టార్ హీరోల్లో ఒక‌రిగా నిలిచారు. వివాదాలకు దూరంగా ప్రయోగాలకు దగ్గరగా దూసుకుపోతున్న‌ మహేష్ బాబు వ‌రుస హీట్ల‌తో జోరు మీద ఉన్నాడు. కథల ఎంపికలో ఆచితూచి అడుగు వేడ‌యంతో.. ఇటీవ‌ల వ‌చ్చిన ఈయ‌న సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురింపించాయి.

 

మహేష్ బాబుకు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టైల్, ట్రెండ్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాబు హీరోయిన్లో ఎప్పుడూ కోపరేటివ్‌గా ఉంటాడు. ఈ విష‌యాన్ని చాలా మంది హీరోయిన్స్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అయితే హీరోయిన్‌ కీర్తి రెడ్డితో మ‌హేష్‌బాబు మంచి అనుబంధం ఉంది. వీరిద్ద‌రూ గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ సినిమాలో అన్న చెల్లెలుగా న‌టించారు. ఈ చిత్రంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న శ్రియ న‌టించిన సంగ‌తి తెలిసిందే. తన చెల్లెలు బావుండేందుకు కష్టపడే ఒక అన్న క‌థే ఇది.

 

అయితే ఈ సినిమాలో కీర్తి రెడ్డిదే మెయిన్ రోల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా మ‌హేష్ బాబు, కీర్తి రెడ్డి ఏదైతే రోల్ చేశారో ఆ త‌ర్వాత కూడా అదే రిలేష‌న్‌ను ఫాలో అయ్యారు. మ‌హేష్ కూడా కీర్తి రెడ్డితో ఎంతో స‌న్నిహిత్యంగా ఉండేవాడు. ఇక 2004లో కీర్తి రెడ్డి వివాహం ప్రముఖ నటుడు సుమంత్తో జరిగింది. అయితే వారు కొన్ని కార‌ణాల వ‌ల్ల 2006 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014 లో లండన్లో సెటిలైన డాక్టర్ కార్తీక్ ను వివాహం చేసుకుంది కీర్తి. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇప్ప‌టికీ కూడా మ‌హేష్ బాబు, కీర్తి రెడ్డి అంతే అనుబంధంగా.. ఇష్టంగా ఉంటారు.  

  

మరింత సమాచారం తెలుసుకోండి: