టాలీవుడ్ లో మెగాస్టార్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి సినిమా చేస్తున్నారు అంటే మార్కెట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉంటాయి. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేసే ప్రతీ సినిమా కూడా ఆసక్తికరంగానే మారింది. అసలు ఆయన ఎవరితో చేస్తారు...? ఏ సినిమా చేస్తున్నారు...? కథ ఏంటీ అనే దానిపై గత కొన్ని రోజులుగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక చిరంజీవితో సినిమా చెయ్యాలని ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ్ వంటి వాళ్ళు కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఇప్పుడు చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు ఏళ్ళకు ఏళ్ళు సినిమా కోసం తీసుకున్న చిరంజీవి ఇప్పుడు అలా కాకుండా కాస్త రూటు మార్చారు. ఇదే సమయంలో ఆయనలో ఒక భయం కనపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రం లో  ఆయన తన పాత్రలో భాగంగా ఒక చిన్న ప్రయోగం చెయ్యాల్సి ఉంటుందని టాక్. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ వివరించారట. 

 

ఇది చేస్తే మాస్ లోకి బలంగా సినిమా వెళ్ళే అవకాశం ఉంటుందని, క్లాస్ కి కూడా నచ్చుతుంది అని చెప్పారట. కాని తాను ప్రయోగం ఏ మాత్రం చేయలేను అని దయచేసి ఆ పాత్రను మార్చాలి అని సున్నితంగా చిరంజీవి తిరస్కరించారట. అయితే అది గుడ్డి వాడి గా చిరంజీవి నటించడం అని, ఫైట్ కూడా గుడ్డి వాడి గా చిరంజీవి చేస్తారని, ఆ విషయాన్ని కొరటాల జాగ్రత్త గా చెప్పినా సరే చిరంజీవి మాత్రం ససేమీరా అన్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కూడా విడుదల చేయవద్దు అని చెప్పెసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: