దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న స్టార్ హీరోయిన్లు ఇప్పుడు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. అవసరమైతే ఎలాంటి పాత్రకు అయినా ఓకే చెప్తున్నారు. అంటే ఎలాంటి విభిన్న పాత్రకు అయినా అని. ఓకే... ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు కొందరు ఇదే విధంగా కష్టపడుతున్నారు. అవకాశాలు వస్తున్నాయి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు ఎందుకు అవకాశాలు వదులుకోవాలి,  డిమాండ్ ఉన్నప్పుడు వెనక్కు తగ్గితే తప్పు ఏంటీ...? 

 

ఆఫర్లు అందరికి వస్తాయా చెప్పండి అంటూ సినిమాలు ఒప్పుకుంటున్నారు స్టార్ హీరోయిన్లు.  త్రిష, కాజల్, నయనతార ఇప్పుడు ఇదే విధంగా వరుస ఆఫర్లను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు వయసు పెరిగే త్రిష కాస్త పాపులారిటి పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ‘96’, ‘పేట’ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ వరుస ఆఫర్లతో చాలా వరకు మంచి సినిమాలే హేస్తుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మాయి,  ‘రాంగి’, ‘పరమపద విళయాట్టు’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘సుగర్‌’ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. 

 

 ‘ఎంగేయుం ఎప్పోదుం’ శరవణన్‌ దర్శకత్వం లోని ‘రాంగి’ సినిమా షూటింగ్ ఈ మధ్య అయిపోయింది. ఈ సినిమా కు ఏఆర్‌ మురుగదాస్‌ కథ, మాటలు రాసారు. దీనితో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఉజబెకిస్థాన్‌లో జరిగింది. అక్కడ మైనస్‌ రెండు డిగ్రీల చలిలోనూ త్రిష నటించింది అని సినిమా యూనిట్ చెప్పింది. ఈ సినిమా షూటింగ్ తెల్లవారుజామున చిత్రీకరణ ఉన్నా సరే ఏ మాత్రం వద్దు చేయను అనకుండా ఈమె సినిమా చేసింది. దీనితో దర్శక నిర్మాతలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ సినిమా షూటింగ్ ని చాలా వేగంగా పూర్తి చేసారట. ఈ సినిమా తర్వలోనే ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: