రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కె.ఎస్ రామారావు నిర్మించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. అసలే డియర్ కామ్రేడ్ పోయిన బాధలో ఉన్న విజయ్ దేవరకొండ ఎలాగైనా సరే వరల్డ్ ఫేమస్ లవర్ తో హిట్టు కొడతాడని భావించారు. కాని సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ త్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

 

ఇక ఈ సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోయింది కాబట్టే విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ కూడా మొక్కుబడిగా కానిచ్చాడన్న టాక్ వచ్చింది. అంతేకాదు జరిగిన రెండు మూడు ఈవెంట్స్ లో కూడా డైరక్టర్ గురించి విజయ్, విజయ్ గురించి డైరక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడ లేదు. అక్కడే విషయం అర్ధమైనా ఇద్దరి మధ్య అంత అండర్ స్టాండింగ్ ఉందేమో అని అనుకున్నారు. కాని సినిమా ఫలితం ముందే తెలిసింది కాబట్టే విజయ్ అలా ఉన్నాడని అర్ధమవుతుంది.

 

మాములుగా అయితే విజయ్ సినిమాలకు మంచి బజ్ ఉంటుంది. డియర్ కామ్రేడ్ కు రిలీజ్ కు నెల ముందునుండే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. కాని వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు మాత్రం సరిగా రిలీజ్ నాలుగు రోజుల ముందు వచ్చాడు. అప్పటివరకు పూరి సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు విజయ్. మరి తన షెడ్యూల్ పరంగా రాకున్నా సినిమాను ప్రమోట్ చేసినా సరే రిజల్ట్ పెద్దగా తేడా ఉండదని ఊహించాడు కాబట్టే విజయ్ దేవరకొండ అలా చేశాడని వార్తలు వస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజప్పాయింట్ చేయడంతో పూరి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: