ఒక్క మాటలో చెప్పాలి అంటే భారత సిని పరిశ్రమను బాలీవుడ్ డామినేట్ చేస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అక్కడ విడుదల అయ్యే సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. ఇక హింది వచ్చిన వాళ్ళు దేశ వ్యాప్తంగా ఉండటంతో ఈ సినిమాలు ఎక్కువగా అన్ని ప్రాంతాలలోను ఆడుతూ ఉంటాయి. ఇదే అక్కడి నటీ నటులకు పొగరు అంటున్నారు పలువురు సిని విశ్లేషకులు. వాళ్ళు ఇతర భాషల నటులను కనీసం మనుషులుగా కూడా చూసే ప్రయత్నం చేయలేరని అంటున్నారు. 

 

ఇటీవల టాలీవుడ్ దర్శకుడు ఒకరు ఒక స్టార్ హీరోతో సినిమా చెయ్యాలి అని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ని సంప్రదించగా ఆమె చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయ్యారట దర్శకుడు. తనకు కాళీ లేదని, ఇప్పుడు మూడు రోజులు డేట్స్ ఇస్తా అని, మళ్ళీ మే లో ఫ్రీ అవుతా అని అప్పుడు ఒక మూడు రోజులు డేట్స్ ఇస్తా అని చెప్పిందట. ఇందుకోసం ఏకంగా రెండు కోట్లకు పైగా డిమాండ్ చేయడమే కాకుండా తాను సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ కి రాను అని కూడా చెప్పెసినట్టు సమాచారం. 

 

దీనితో ఆ స్టార్ హీరోయిన్ తో సినిమా చెయ్యాలి అనే ఆలోచనను సదరు దర్శకుడు చంపుకున్నారని టాక్. అవసరమైతే మరో హీరోయిన్ తో సినిమా చేస్తాను గాని తనకు అంత ఖర్మ పట్టలేదని, ఆమె అవసరం కూడా అంత లేదని, ఇక్కడ 30 నుంచి 50 లక్షలు ఖర్చు పెడితే మంచి హీరోయిన్స్ దొరుకుతారు అని ఆయన వచ్చేసినట్టు సమాచారం. ఆమెతో పాటుగా దాదాపుగా ముగ్గురు హీరోయిన్ల ను సంప్రదించినా సరే ఇదే విధంగా సమాధానం చెప్పారట. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: