ఎంత వినయంగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి. ఎంత గౌరవంగా చూసుకుంటే అంత గౌరవం దక్కుతుంది. మాట ఎంత బాగుంటే ఆఫర్ అంత త్వరగా వస్తుంది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కష్టం. ఇప్పుడు ఈ అభిప్రాయ౦ టాలీవుడ్ హీరోయిన్లలో చక్కగా కనపడుతుంది. గతంలో టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది పొగరుగా ప్రవర్తించే వారు. సినిమా కార్యక్రమాలకు రాకపోవడం వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ చేయడం, వాళ్ళు చెప్పింది దర్శక నిర్మాతలు వినాలి అనే విధంగా వ్యవహరించడం వంటివి గతంలో చూసే వాళ్ళు. 

 

దీనిపై ఎందరో దర్శక నిర్మాతలు పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసారు కూడా. దివంగత దర్శక నిర్మాత దాసరి నారాయణ ఈ విషయంలో ఎన్నో సార్లు అసహనం వ్యక్తం చేసారు. వాళ్ళను కార్యక్రమాలకు పిలవొద్దని, వాళ్ళతో అవసరం మేరకే వ్యవహరించాలని దాసరి పలు మార్లు చెప్పారు. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోయిన్లు గా చెప్పుకునే వాళ్ళు సినిమా పరిశ్రమకు వాళ్ళ పొగరు తో దాదాపు గా దూరం అయ్యారు. ఇక ఇప్పుడు హీరోయిన్ లు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త లు పడుతున్నట్టు సమాచారం. 

 

ఎంత వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని, దర్శక నిర్మాతల తో గౌరవంగా వ్యవహరించాలని, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించ వద్దు అని భావిస్తున్నారట. నాలుగు కాలల పాటు సిని పరిశ్రమలో నాలుగు సినిమాలు చేసుకోవాలి అంటే ప్రతీ ఫంక్షన్ కి హాజరు కావాలి అని , సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నారట. ఇక ఆఫర్ వచ్చిన సమయంలో ఒక రూపాయి తక్కువ అయినా పర్వాలేదు గాని ఇంతే కావాలని డిమాండ్ చేయకుండా ఉండాలని అర్ధం చేసుకున్నారట. ఆఫర్ వచ్చిన సమయం లో పాత్ర విషయం లో డిమాండ్ లు కండీషన్ లు పెట్టుకుండా ఉంటే మంచిదని అర్ధం చేసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: