ఉదయభాను, ఈ పేరు తెలియని వారు ఉండరు తెలుగు పరిశ్రమ లో బుల్లి తెర మీద ఈమె కు ఉన్న క్రేజ్ స్టార్ హీరోయిన్ కి కూడా ఉండదు అనేది వాస్తవం. ఎంతో మంది వచ్చి కనుమరుగు అయిపోయినా సరే తనకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాల తో ఆమె ఇప్పటికీ సినీ పరిశ్రమ లో ఎక్కడో ఒక చోట కనపడుతూనే ఉంది. నలుగు పదుల వయసు దాటినా కొన్ని కొన్ని విషయాల్లో ఆమెను కొట్టే వారు లేరు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. బుల్లి తెరకు ఆమె ఒక గ్లామర్ బ్రాండ్. 

 

ఇప్పుడు అంటే అనసూయ, రేష్మీ, వాళ్ళు వీళ్ళు అని చూస్తున్నాం గాని ఒకప్పుడు మాత్రం టీవీ స్క్రీన్ మీద ఆమె ఆమె ఒక సంచలనం. గతం లో ఆమె లేకుండా ఏ షో ఉండేది కాదు అనే విషయం అందరికి తెలిసిందే. ఆమెకు మహిళా అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే సుమ వచ్చిన తర్వాత ఆమె ఇమేజ్ గ్రాఫ్ కాస్త పడింది అప్పటి నుంచి కూడా ఆఫర్లు తగ్గాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఆమె మాత్రమే వచ్చేది. ఇక విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, కవల పిల్లలను కని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. 

 

మొన్నా మధ్య బాలకృష్ణ రూలర్ సినిమా ఆడియో కార్యక్రమంలో కనపడింది. తాజాగా ఆమె తన కోరిక తీర్చుకుంది. తనకు ఎంతో ఇష్టమైన కాస్లీ అయిన బెంజ్ కారు కొనుక్కుని తన కోరిక తీర్చేసుకుంది. తన భర్త విజయ్‌ తో పాటు గా తన ఇద్దరు పిల్లలతో కలిసి బెంజ్ కారు తో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడిన ఈమె ఇప్పుడు లాఫ్ లో సెటిల్ అవుతుంది. మళ్ళీ ఆఫర్లు వస్తే చెయ్యాలి అని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: