జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ఏ వార్త వచ్చినా సరే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ రెండో భార్యగా ఆమె ఒక రేంజ్ లో పాపులర్ అయింది. పవన్ తో ఉన్నప్పుడు కంటే పవన్ నుంచి దూరమైన తర్వాత ఆమెకు కాస్త ఫాలోయింగ్ పెరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది రేను. సినిమాలు చేస్తూనే, కొన్ని షోస్ లో నటిస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తుంది. 

 

ఇక అప్పుడ్పప్పుడు పిల్లల గురించి కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేస్తుంది రేను. ఇక ఇదిలా ఉంటే ఆమెపై వచ్చే గాసిప్స్ అన్నీ ఇన్ని కాదు. చిన్న వార్త వచ్చినా సరే అందరూ ఆసక్తి గా చూస్తూ ఉంటారు. మరి రేను పాపులారిటి ఆ రేంజ్ లో ఉంటుంది కదా. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రస్తుత పింక్ సినిమా రీమేక్ లో ఈమె పాత్ర ఉంటుంది అని అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి. 

 

నిప్పు లేకుండా పొగ రాదు అనేది పాత సామెత. కాని ఇప్పుడు అలా కాదు. అసలు నీళ్ళల్లో కూడా నిప్పుని పుట్టిస్తుంది సోషల్ మీడియా. అందుకే ఈమె పింక్ సినిమాలో నటిస్తుంది అన్నారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించింది. `మీరు `పింక్` రీమేక్‌లో నటిస్తున్నారా?` అని ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రేణును ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేణు.. `లేదు. అవన్నీ అసత్య కథనాలు` అంటూ ఆమె కొట్టిపారేసింది. ఇటీవల పవన్ ఆమెకు ఒక ఫ్లాట్ కూడా కొనిచ్చారు అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: