టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తో ఎంతో ప్రతిష్టాత్మకంగా సైరా సినిమా తెరకెక్కించాడు. దాదాపు రెండు సంవత్సరాలపాటు చిరంజీవి ‘సైరా’ సినిమా కోసం తన కాలాన్ని వెచ్చించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సైరా సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాదాపు అయిదు భాషల్లో విడుదలైన ఈ సినిమా కొద్దోగొప్పో తెలుగులో పర్వాలేదనిపించింది. దీంతో సక్సెస్ రాకపోవటంతో సురేందర్ రెడ్డి తో పని చేయడానికి చాలా మంది ఆలోచించారు. సైరా సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో నటించిన సినిమా సురేందర్రెడ్డి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి.

 

అయితే సైరా సినిమా రిజల్ట్ దారుణంగా ఉండటంతో ప్రభాస్.. సురేందర్ రెడ్డిని పక్కన పెట్టారట. ఆ తర్వాత రెండు మూడు ప్రాజెక్టులు సురేందర్ రెడ్డి అనుకున్న గాని అది కన్ఫర్మ్ కాలేదు. దాదాపు స్టార్ హీరోల రేంజ్ సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరొందిన సురేందర్ రెడ్డి..అవకాశాలు రాకపోవటంతో అక్కినేని ఫ్యామిలీ పై కన్నేశాడు అని ఫిలిం నగర్లో టాక్. మేటర్ లోకి వెళితే అక్కినేని అఖిల్ తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయాలని సురేందర్ రెడ్డి స్టోరీ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ లోనే మంచి క్రేజ్ కలిగిన అక్కినేని ఫ్యామిలీ నుండి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఇప్పటి వరకు సరైన సక్సెస్ దొరకలేదు.

 

దీంతో చాలామంది అక్కినేని అభిమానులు కుటుంబ సభ్యులు కూడా అఖిల్ సినిమాలు హిట్ అవ్వడం లేదని ఫీల్ అవుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త కొత్తగా ట్రై చేసిన అఖిల్ కి సరైన సూపర్ హిట్ సినిమా పడలేదు. అదేవిధంగా నాగార్జున అఖిల్ కెరీర్ లో ఇన్ వాల్వ్ అయినా గాని స్టోరీలు సెలెక్ట్ చేస్తున్నా గాని పని కావటంలేదు. కాగా అఖిల్ కు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. దీంతో అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు సురేందర్ రెడ్డి భారీ ప్రాజెక్ట్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు అఖిల్ కి పడేలా సురేందర్ రెడ్డి అఖిల్ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: