టాలీవుడ్ లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజా. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో మాస్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ స్టార్ హీరో... ఇప్పుడు సినిమాలు హిట్స్ రాకా నానా ఇబ్బందులు పడుతున్నాడు. యువ హీరోలు పెరిగిపోవడం, దానికి తోడు ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గడం, అవి కూడా ఫ్లాప్ లు అవ్వడంతో రవితేజా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ కథ ఎంచుకున్నా సరే సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు ఈ మాస్ హీరో. 

 

దానికి తోడు దర్శకులు కూడా అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. నేరుగా అతనే వెళ్లి కొందరు దర్శకులను అడిగినా సరే కాళీ లేదని చెప్పారట. దానికి తోడు నిర్మాతలు కూడా కమర్షియల్ గా ఆలోచించడం తో ఇతని డిమాండ్ ఇప్పుడు పడిపోయింది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఒక్క సినిమానే చేస్తున్నాడు. క్రాక్ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. 

 

సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆ సినిమాల తర్వాత సినిమా చేయవద్దు అనే ఆలోచనలో ఉన్నాడట ఈ స్టార్ హీరో. ఇప్పట్లో ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచన చేయడం లేదని అంటున్నారు. ఉన్న సినిమాలను పూర్తి చేసి హీరోగా తప్పుకుని, వచ్చే ఏడాది నుంచి క్యారెక్టర్స్ లో చేసే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇటీవల తన సన్నిహిత దర్శకుడి వద్ద ఇదే విషయం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తనకు ఇంకా హీరోగా చెయ్యాలని లేదని చెప్పేసాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: