విజయ్ దేవరకొండ అనే పేరు వినపడగానే సినిమాలను రెగ్యులర్ గా చూసే వాళ్లకు అతని ఎనర్జీ గుర్తుకి వస్తుంది. తెలంగాణా యాస లో అతను మాట్లాడే మాటలు కళ్ళ ముందు ఉంటాయి. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బాబు కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి కూడా వరుస ఆఫర్లతో, సినిమాలు చేస్తున్నాడు. కొందరు దర్శకులు కూడా అతనితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

అయితే ఒక సినిమా హిట్ అయితే రెండు మూడు సినిమా లు ఫ్లాప్ అవుతున్నాయి. దానికి అసలు కారణం ఏంటీ అనేది తెలియకపోయినా, బాబు చేసే ఓవర్ యాక్షన్ కొంప ముంచుతుంది అంటున్నారు సిని పరిశీలకులు. సాధారణంగా మన వాడికి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ వచ్చింది. దాన్ని అక్కడి వరకు ఉంచుకుంటే బాగుండేది. కాని ఏదైనా ఫంక్షన్ లో, సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉంటాడు. దీనితో అతని పై కొందరు కక్షగట్టారు అని అంటున్నారు. 

 

సినిమా ముందు అతను చేసే వ్యాఖ్యలు, ఆడియో కార్యక్రమం లో అతని ప్రవర్తన యూత్ కి నచ్చుతుంది గాని సినిమా పరిశ్రమలోనే కొందరికి నచ్చడం లేదు. ఓవర్ యాక్షన్ చేయడం అతనికి కలిసి రావడం లేదని అంటున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత కాస్త బాబు యాటిట్యూడ్ చూపించాడు. అది మైనస్ అయింది. క్రేజ్ గురించి పక్కన పెడితే అవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అనే వారు కొందరు. సినిమా పరిశ్రమలో కాస్త తగ్గి ఉంటే మంచిది అంటున్నారు. ఇక యూత్ ని కెలికే విధంగా మాట్లాడుతూ, సినిమా పోస్టర్ల విషయంలో సమర్ధించుకోవడం ఇవన్ని కూడా బాబు కొంప ముంచుతున్నాయి అంటున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: