ఒక్క డాన్సర్ హీరో అయ్యారు. కానీ ఒక్కక క్రికెటర్ హీరో అయితే ఆ కిక్కే వేరే. ఈ ప్లేయర్ తనలో ఉన్న మరో కోణాన్ని అభిమానుల ముందుకు తీసుకరానున్నారు. తన అభిమానులకి చుపించాలనుకున్నాడు ఈ క్రికెటర్. తన బౌలింగ్ తో అభిమానుల మాది గెలుచుకున్న ఈ ఆటగాడు తన నటనతో ప్రేక్షకుల మనసును ఎంతలా మేపిస్తారో చూడాల్సిందే. 

 

భారత క్రికెట్‌లో స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ది ఒక అధ్యాయం. తన అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. అనిల్ కుంబ్లే తరవాత భారత్ నుంచి టాప్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్‌‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ ను మొదలుపెట్టారు. క్రికెట్ కెరీర్‌లో మంచి పీక్ టైమ్‌ లో ఉన్నప్పుడు పలు కంపెనీలకు ప్రచారకర్తగా కెమెరా ముందు నటించిన భజ్జీ.. ఇప్పుడు సినిమాలోనే నటిస్తున్నారు.

 

హర్భజన్ సింగ్ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా ‘ఫ్రెండ్‌షిప్’. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌ గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌ పై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక క్రికెటర్ హీరోగా నటిస్తోన్న తొలి సినిమా ఇది. హర్బజన్ సింగ్ సినిమాలో హీరో అర్జున్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.

 

ఈ చిత్రాన్ని పలు భార‌తీయ‌ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ స్పెష‌ల్‌ గా విడుద‌ల‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: