రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఏది చేసినా హాట్‌టాపిక్‌గా మారిపోతుంది. మోడలింగ్‌, నటిగా తనదైన ముద్ర వేసుకున్న రకుల్‌ నటిగా పీక్‌స్టేజ్‌లో వుండగానే జిమ్‌ వ్యాపారంలోకి దిగింది. యోగా, మెడిటేషన్‌ వంటివి అక్కడ నేర్పిస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ధృవ, జయజానకి నాయక, సరైనోడు, దేదే ప్యార్‌దే వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన రకుల్‌ కన్నడ, తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో బిజీగా వుంది. తాజాగా ఇండియన్‌2 చిత్రంలో నటిస్తోంది. ఇందులోని పాత్ర కోసం ప్రత్యేక తర్ఫీ తీసుకుంటోంది. ఇదిలా వుండగా, తన గ్లామర్‌ను ఇంతకుముందే ఫిలింఫేర్‌ 2019లో అద్భుతంగా ప్రదర్శించి అభిమానుల్ని ఉర్రూతూరించింది. పై అదరాు కన్పిస్తూ అటు ఫొటోగ్రాఫర్లను, వీక్షకును కనువిందచు చేసింది కూడా. 

 

అలాంటి రకుల్‌ ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం రూపొందిన బేటీ బచావో, బేటి పడావో ప్రోగ్రామ్‌ను అంబాసిడర్‌గా వ్యవహించింది. ప్రస్తుతం రకుల్‌ మాక్జిమ్‌ మేగజైన్‌ కోసం తన అందాల్ని ఆరబోసింది. ఇందుకోసం పు ఫొటోషూట్‌ను నిర్వహించింది కూడా. హాలీవుడ్‌ భాము జెన్నిఫర్‌లోపేజ్‌ వంటి ఎందరో భాము ఎక్కువగా కవర్‌పేజీలో నిలిచే మాక్జిమ్‌ మేగజైన్‌లో ఈసారి రకుల్‌ వారికి ధీటుగా తన అందాల్ని చూపిస్తోంది. 

 

ఈమధ్య ప‌లువురు హీరోయిన్లు కూడా కొత్త ఫొటో షూట్‌ చేస్తూ గ్లామర్‌ను చూపించేందుకు తహతహలాడుతు న్నారు. తాజాగా రకుల్ మ్యాగజైన్ కోసం తీసిన ఫొటో షూట్‌ యువతను నిద్రపోకుండా చేస్తుందేమోకానీ.. అంతకంటే ఎక్కువగా తన గ్లామర్‌ను ఫిలింఫేర్‌లోనే ఎక్కువగా చూపించింది. ప్రస్తుతం నటిగా తెలుగులో వెనకబడ్డ రకుల్‌ ఏకంగా హాలీవుడ్‌కు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. ఇండియన్‌2 చిత్రం విడుదలైతే హాలీవుడ్‌ను ఆకర్షించవచ్చని భావిస్తోంది. తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ, ఖాళీ కాస్త దొరికినా తమిళ సినిమాలకు టైమ్‌ కేటాయిస్తానని చెప్పింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.  

 

తొందరగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటే ఫెయిల్యూర్స్‌ ఎదురవుతాయి కాబట్టి, ఆలస్యంగా అయినా జాగ్రత్తగా సినిమాలు ప్లాన్‌ చేసుకుంటానని చెప్పే రకుల్‌ ప్రీత్‌సింగ్‌, అనుకోకుండా సినిమాల్లోకొచ్చి, ఈ స్థాయికి చేరుకోవడం ఆనందాన్నిస్తోందని, మంచి నటిగా ఏ భాషలో అయినా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతోనే సినీ రంగంలోకి వచ్చానని అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: