మొహానికి మేకప్ వేసుకొని హీరోయిన్ అన్న టాగ్ వచ్చాక పాపులారిటి వచ్చినా రాకపోయినా అడపా దడపా నాలుగు సినిమాలు చేస్తే చాలు ఇక కాలు నేలమీద నిలవదు. ఎంతసేపటికి ఏ షాప్ ఓపెనింగ్ కి పిలుస్తారా, ఎక్కడ ఈవెంట్ లో డాన్స్ చేయమంటారా ..అంటూ సినిమాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఇలాంటి అడిషనల్ ఇన్‌కం వచ్చే వాటి మీద ఎక్కువగా దృష్ఠి సారిస్తుంటారు. ఒక్కోసారి సినిమాకి డేట్స్ సర్ధుబాటు చేసి కూడా మేకర్స్ కి చెప్పా చేయకుండా దుబాయ్ ఫ్లైటెక్కేస్తుంటారు. దాని వల్ల నిర్మాతకి పెద్ద బొక్క పడుతుంది. నమ్ముకున్న హీరోయిన్ అడ్వాన్స్ తీసుకొని మరీ నట్టేట్లో ముంచేస్తే ఆ నిర్మాత పరిస్థితి చెప్పడానికి ఎంత దారుణంగానో ఉంటుంది.

 

అదే ఆ హీరోయిన్ పరిచయం చేసిన నిర్మాతకి రెండవ సినిమాకే ఇలాంటి అనుభవం ఎదురైతే ఇక ఆ నిర్మాతకి రక్త కన్నీరే. అయితే ఇలా హీరోయిన్స్ చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని అందరు అంటుంటారు. కమిటయిన సినిమాని మధ్యలో వదిలేసి, క్రేజీ ఆఫర్ వచ్చిందని ఇంకో సినిమాకి కమిటవడమో, లేదా బాలీవుడ్ పిలిచిందని మానేజర్ తో చెప్పించి ఫ్లైటెక్కేయడమో చేస్తున్న హీరోయిన్స్ కి చెప్పు దెబ్బలా మేకర్స్ కూడా వ్యవహరిస్తే సరిపోతుంది. కానీ సినిమాకి గ్లామర్ అవసరం కాబట్టి సర్ధుకు పోక తప్పడం లేదనంటారు.

 

అయితే ఇలా హీరోయిన్స్ ముఖ్యంగా కమిటయిన సినిమాలకి వర్క్ చేయకుండా దుబాయ్, అమెరికా వెళ్ళేది అక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ లో పాల్గొనడానికి. ఆ ఈవెంట్స్ లో పాల్గొంటే గంటల్లోనే లక్షలు సంపాదిస్తుంటారు. ఇక్కడ ఒక సినిమా చేస్తే వచ్చే లక్షల రెమ్యూనరేషన్ అక్కడ ఒక ఈవెంటో నాలుగు పులిహోర పాటలకి డాన్స్ చేస్తే వచ్చేస్తుంది. ఇది చెప్పే చాలామంది మానేజర్స్ హీరోయిన్స్ ని తప్పుదోవ పట్టిస్తుంటారు. అందులోను వీళ్ళు పైసా ఖర్చు లేకుండా విదేశాలన్ని చుట్టేసే ఛాన్స్ వస్తుంది.

 

అందుకే ఇలాంటి వెధవ పనికి, సంపాదనకి అలవాటు పడతారు. అయితే అలాంటి హీరోయిన్స్ ఎక్కువకాలం సినిమా ఇండస్ట్రీలో కొనసాగలేరు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్న సామెతలా తయారవుతుంది పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: