‘సైరా’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి సాధించారు. గత ఏడాది అక్టోబర్ 2వ తారీఖున రిలీజ్ అయిన సైరా మెగాస్టార్ కెరియర్ లో అదిరిపోయే విజయాలను సాధించింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా తెరకెక్కిన సైరా హిందీ, తమిళం, మలయాళం, కన్నడం అలాగే తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. అన్ని భాషల కంటే ఎక్కువగా తెలుగు భాషలోనే మంచి విజయాన్ని సాధించింది. దాదాపు ఇంద్ర సినిమా కి ఏ విధమైన రెస్పాన్స్ రావటం జరిగిందో అదే రెస్పాన్స్ సైరా కి వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించడంతో లాభాలు కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రెండు సినిమాలు ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావటంతో తాజాగా చేయబోయే కొరటాలతో హ్యాట్రిక్ కొట్టాలని చిరంజీవి ఫుల్ గా డిసైడ్ అయ్యారట.

 

ఇదే సందర్భంలో తండ్రి చిరంజీవి సినిమాలు దగ్గరుండి నిర్మిస్తున్న రామ్ చరణ్ సినిమాతో కూడా నిర్మాతగా హ్యాట్రిక్ కొట్టాలని కొరటాల శివ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారట. ఇటువంటి నేపథ్యంలో సినిమా కోసం చిరంజీవి ఇప్పటికే సన్న బడటం జరిగింది. ప్రస్తుతం కొరటాల తో చేయబోయే సినిమా టైటిల్ ఆచార్య అనే టైటిల్ పెట్టినట్లు మనకందరికీ తెలిసిందే. కాగా సినిమాలో చిరంజీవి డబల్ రోల్ చేయనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగింది. దాదాపు చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు మణిశర్మ సంగీతం అందించడం తో ఈ సినిమాకి మణి శర్మ పేరు చెప్పగానే మెగా అభిమానుల్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే టాక్ గట్టిగా ప్రస్తుతం వినబడుతుంది.

 

ఇదే సందర్భంలో ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక కొత్త వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే సినిమాకి సంబంధించి బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా  మాస్ ఏరియా అయినటువంటి సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రానికి భారీ ధర పలికింది అని ప్రచారం జరుగుతుంది.ఇక్కడ గతంలో ప్రతిరోజూ పండగే హక్కులను కొనుగోలు చేసిన అభిషేక్ రెడ్డి మెగాస్టార్ సినిమా తాలూకా సీడెడ్ రైట్స్ ను ఏకంగా 18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ వార్త నిజమే అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే కొరటాల చిరు మూవీ రికార్డు క్రియేట్ చేసినట్లే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: